చిన్నారి చిట్టి తండ్రి ,నా బాబు బంగారు బుజ్జి తండ్రి
నా మాట విను నాన్న ,నీ కంటి పాపను నేను కాన .
ఉదయాన్న నిద్ర లేపి మొఖన్న నీళ్లు కొట్టి
స్నాన పానీయ మంటూ నిద్ర పాడు చేయ్యోదని
తాత తో నే చెప్పినా నానమ్మ నా మాట వినదు నాన్న
వొక మారు చెప్పు నాన్న నీ కంటి పాపను నేను కాన
మా ఎమ్మా బంగారు బొమ్మ ,పాలిచ్చి పోతవమ్మ
వొక ముద్దా పెట్ట వమ్మ ,బిర్యాని తినాలని వున్నా దమ్మ

వో అత్తా మేనత్త ,నా బావ ఎక్కడమ్మా
వొక మారు పంప వమ్మ ,ఆడాలని వున్నది అత్తమ్మ
ఎ మామ్మ వదినమ్మ ,మా అన్నా ఎక్కడమ్మా
నువేనా పంపవమ్మ,ఆడాలని వున్నది వదినమ్మ
ఈ ఇంటి జ్యోతి నమ్మ నీ కంటి వెలుగుని నేనమ్మ
నా మోము చూసేందుకు నీకు టైం యెడ వున్నా దమ్మ
ఇంజనీరు మా అమ్మ నాన్న ,
నా తోన ఆడేందుకు టైము లేదన్న
నేనేమి చెయ్యాలో
నువేనా చెప్పు నాన్న నీ కంటి పాపను నేను కాన