మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Friday, August 21, 2009

నేను నాలుగు అడుగులు వేసినాను - మేము మైసూర్ వెల్లినాము

ఏమిటి ?? నడుచుకుంటూ మైసూర్ వెల్లినాము అనుకున్నారా ?? హ హ హ ..... అసలు సంగతి ఇది ...

హలో ఫ్రెండ్స్,

నేను ఈ నెల 12th న ( అంటే నాకు పదకొండు నెలలు పూర్తీ అయిన రోజున ) నాలుగు అడుగులు నడిచినానోచ్ ..
అమ్మ, నాన్న చాల ఆనందపదినారు .

పోఇన గురువారం (13th, ఆగుస్ట్ ) , నా పుట్టిన రోజు వస్తుంది కదా ... నన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్ళిపోవటానికి నానమ్మ బెంగుళూరు వచినది....నేను కొంచెం నానమ్మ కి అలవాటు పడాలి కదా..అందుకే ముందు వచ్చినది .

ఈ ఆనంద సమయం లో, మేము అందరం ....ఆదివారం (16th ఆగష్టు ) మైసూర్ ట్రిప్ వెల్లినాము.

మీకు నా మైసూర్ ట్రిప్ సంగతులు చెప్పనా ....



నేను కడుపు లో వున్నప్పుడు , అమ్మ మైసూర్ ట్రిప్ వెళ్ళినది అట......అయితే నాకు ఇది రెండవ మైసూర్ ట్రిప్ అన్నమాట ... అవును కదా ఫ్రెండ్స్ ??కార్ తీసుకొని , బెంగుళూరు నుండి 6:30 కి బయలు దేరినాము .

ముందుగా "శ్రీ రంగ పఠనం " వెల్లినాము . అక్కడ టిప్పు సుల్తాన్ రాజు ఇల్లు ( అదే తన కోట ) చూసినాను . ఇదిగో మీరు కూడా చుడండి ....

ఆ తరువాత , అమ్మ నాకు కొంచెం అఆం పెట్టాలని చుసినాది ..కాని తిన లేదు లే ....:)అక్కడి నుండి టిప్పు సుల్తాన్ అమ్మ , నాన్న సమాది చూసినాము . అక్కడే టిప్పు సుల్తాన్ సమాది కూడా. ఇదిగో మీరు చుడండి ...

అక్కడి నుండి ఆ పక్కనే వున్నా త్రివేణి సంగమం ( మూడు నదులు కలిసే స్తలం - కావేరి , ఇంక రెండు నదులు లే ) వెల్లినాము . అక్కడ పడవ కూడా ఎక్కినాము . ఇదిగో చుడండి .



అప్పటికే 12 అయినది .అక్కడి నుండి , నీళ్ళ జైలు కి వెల్లినాము . రాజు గారు వున్నప్పడు , ఖైదిలని ఆ నీళ్ళ జైలు లో వుంచే వారు అట. ఇదిగో చుడండి...



అక్కడి నుండి మేము రాగవేద్ర టెంపుల్ కి వెల్లినాము ( ఆ నీళ్ళ జైలు పక్కనే లే ). ప్రసాదం తెచ్చుకున్నాము.దేవుడి దర్శనం తరువాత , ఇక మేము శ్రీ రంగం పఠనం నుండి మైసూర్ బయలు దేరినాము. దారిలో నేను ప్రసాదం బాగా తిన్నాను. అసలే అక్కలి ఫై వున్నాను కదా. :)

మొదటగా , మైసూర్ లో , చమోన్దేస్వరి గుడి కి వెల్లినాము . ఆ గుడి పెద్ద కొండపై వుంది . ప్రయాణం చాల బాగుంది . ఇదిగో పొటోలు చుడండి ...అక్కడినుండి వచేటప్పుడు , నంది గుడి కి వెల్లినాము... అక్కడ పెద్ద నంది వుంది . బాబోయ్ ఏట పెద్దదో చుడండి .

ఇక మైసూర్ ప్యాలస్ కి వచేసినాము .ఎప్పుడ ఎప్పుడా అని ఎదురు చూసినది దీనికోసమే లే :) ...నేను కాదు లే..మా నాన్న లే :) అదేదో మా నాన్న కట్టించినట్టు ఫీల్ అవుతాడు :)

ప్యాలస్ చాల చాల బాగుంది. - రాజు గారు పూజించిన దేవుడి విగ్రహాలు , బంగారపు, వెండి మందిరాలు , వస్తువులు , పెళ్లి మందిరం, వెండి తలుపులు , సింహాసాలు , ఇంకా కట్లు ,తుపాకులు , పిరంగులు ...మొదులు గున్నవి చూసినాము .పాపం నాను ఎత్తుకొని మోయలేక అమ్మ , నాన్న చాల కష్టపడినారు :)
ఇదిగో ప్యాలస్ దగ్గర పొటోలు చుడండి.... కుదిరితే మీరు కూడా ఒకసారి వెళ్ళండి..


అక్కడి నుండి అమ్మ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బృందావన్ గార్డెన్స్ కి బయలు దేరినాము...మేము వెళ్ళేటప్పటికి మబ్బులు లు కూడా వచినవి....టికెట్స్ కొని లోపలకి వెళ్ళే సరికి పెద్ద వర్షం పడినది.పాపం, అమ్మ బృందావన్ గార్డెన్ లో లైట్ షో చద్దాం అంటే కుదరలడు ....నా ఫై చినుకులు పడతాయి ఏమో అని...అంతే ఒక గంట సేపు నిలపదినారు ... వర్షం తగ్గిన తరువాత లైట్ షో చూడడం అని...ఇక వర్ష తగ్గక పోయే సరికి ...బృందావన్ గార్డెన్ చూడకుండానే.... 7 PM కార్ లో బెంగుళూరు బయలు దేరినాము...రాత్రి 11 pm కి బెంగుళూరు వచినాము...ఇక నిద్ర వస్తుంది ఫ్రెండ్స్...వుంటాను మరి...

Thursday, August 6, 2009

హలో ఫ్రెండ్స్ ఎలా వున్నారు ?

హలో ఫ్రెండ్స్ ,
ఇప్పుడు నాకు పదకొండవ నెల కదా .....ఇప్పుడు నేను నిలబడ గలుగుతున్నాను .. మరియు నాకు నాకు రెండు పళ్ళు కూడా వచినాయోచ్..
పోయిన నెల లో ( జూలై 19th - 28th ) , నానమ్మ కాసి వెళ్లి వచ్చినది . నాకు డ్రెస్ లు తెచ్చినది . కొత్త డ్రెస్ లో నా ఫోటో ఇదిగో చుడండి .....బాగుందా ??

బాగోలేదు అంటే కొట్టెస్తాను ......

రఫ్ ఆడిస్తాను ...

ఏమిటి బయపడి పొయినారా ? నిజం చెప్పనా... నేను చిన్న పిల్లని కదా...నాకే బయం ఎక్కువ..


నానమ్మ నాకు తేనే కూడా తెచినది...ఇప్పుడు నేను రోజు తేనే తింటున్నాను...మీకు తేనే పలుకులు చెప్పాలి కదా మరి.
ఈ మద్య నాకు ఏమి తినాలి అనిపించటం లేదు ఫ్రెండ్స్. అమ్మ , నాన్న ఏమో తెగ బాద పడిపోతున్నారు .
మీ అందరికి గుర్తు వుంది కదా...వచ్చే నెల లో (12th ) న నా పుట్టిన రోజు. తాత వాళ్ళ దగ్గర (హైదరాబాద్) కి వెళ్తాను . . హైదరాబాద్ లోనే పుట్టిన రోజు జరుపుకొని ....అక్కడే వుంటాను ఇంకా .
మీరు అందరూ తప్పకుండా రావాలి ...
ఇక వుంటాను ఫ్రెండ్స్ , నిద్రవస్తుంది...


ఇట్లు,
మీ జోషిత చౌదరి.