మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Friday, November 19, 2010

వదినమ్మ వోణీల మహోత్సవం లో మీ జోషిత

హలో ఫ్రెండ్స్ ,

మీకు తెలుసు కదా ? వదినమ్మ అంటే హరి చందన , అదే నా అత్తమ్మ కూతురు .

ఎందుకు లే...ఇదిగో చుడండి వదినమ్మ ఫోటో ఒకసారి..

అత్తమ్మ ఎదురు చూస్తున్న రోజు (నవంబర్ 19th 2010) రానే వచ్చినది ....

వదిన కోసం...నాన్న చేపించిన ఆహావానం లు చుడండి ....నాన్న మజాక .

ఈరోజు నేను స్టేజి ఫై వేసి అడుగులు..పరుగులని అందరికి చూపాలి అని...తాతయ్య ,నానమ్మ కూడా ఎదురుచూస్తున్నారు లే..

ఇదిగో నా కొత్త డ్రెస్ ....అదిరేటి డ్రెస్ నేను వేస్తె ఎలా వుంటానో చుడండి మరి ...

బాగుందా?? మీకు ఇంకొక విషయం చెప్పనా??...ఈ డ్రెస్ ఫై పూసలు...డిజైన్ కుట్టినది నాన్నే...పాపం రెండు రోజులు కస్టపడి కుట్టినాడు...మరి నాన్నకి నేను అంటే అంత ఇష్టం కదా మరి...

ఇదిగో మా అమ్మ నాకు చేసిన అలంకరణ....నాకు అరవంకేలు అవసరమా?? ఇదిగో రబ్బరు బ్యాండ్ వేసి అల్లా పెట్టినది .

సూపరో సూపర్ కదా.... అమ్మ న మజాక నా ..

ఇక వోణీల మహోత్సవం కి వస్తే...చెప్పలిసినది..నా వదినమ్మ అలకరణ చుడండి....

నన్ను చూడు ....నేను వేసుకున్న బంగారం చూడు అన్నట్లు ఎంత మురిసి పోతుందో...

అబ్బో వదినమ్మో ...మరి అంతా వయారాలు పోకమ్మో...

మన లో మాట...వదినమ్మ బాగుంది కదా ఈ డ్రెస్ , అలంకరణ లో ...

అదేలే నా అంతా కాదు అనుకోండి ... :)

ఇక , పార్టీ లో ఇంకొకటి చెప్పుకోవాలి...డాన్స్ , పాటల ప్రోగ్రాంపెట్టిన్చినారు కదా.....ఇదిగో చుడండి..

నేను ముందే చెప్పినాను..నేను వుండగా బయట వాళ్ళు ఎందుకు అని...ఈ పెద్ద వాళ్ళు , మా పిల్లల మాట వినరుకదా..

చివరికి ఎవరు బాగా డాన్స్ వేసినారో మీరే చెప్పండి....

అందరు నన్నే మేచుకున్నారు....నేను కనుక ఒక తిప్పుడు తిప్పినాను అంటే..అంతే...అల పడిపోవలిసినదే...

కొంచెం ఎక్కువ చెప్తున్నాను కదా .. :)

వదినమ్మ మహోత్సవం లో జరిగిన కొన్ని మడురమిన గట్టలు చెప్పు కోవాలికదా...

ప్రోగ్రాం అంతా నాన్నే నన్ను ఎత్తుకొని...వచ్చిన వాళ్ళ అందరికి చూపించి ....మురిసిపోయినాడు ..

అమ్మ ఏమో...సింగారించుకొని...అటు ఎటు తిరుగుతూ హడావుడి చేస్తూ వున్నది..ఇదిగో చుడండి మరి..

వదినమ్మ ,అమ్మ ,నాన్న దగ్గర అసిర్వాదం తీసుకుంటుంటే ...నేను ఏమి తక్కువ తిన్నానా ?? ఇదిగో నేను కూడా ఎలా ఆశీర్వాదం తీసుకున్నాను ...

ఇక ప్రోగ్రాం లో ... బాల కృష్ణ వేషం లో ఎవరో నటిస్తుంటే...నాన్న ని చూడాలి మరి...అబ్బో ..కాళ్ళ ఫై నిలబడ లేకపోఇనాడు లే...ఇదిగో చుడండి...ఆ స్టైలే...ఏదో ఈయనే బాల కృష్ణ అయిన లెవెల్ లో ఎచ్చులు పోతున్నాడు..:)

ఇక చివరి లో నేను వేసిన డాన్స్...తిప్పుడు, ఈ ప్రోగ్రాం మొత్తం లో..మరచి పోలేనిది లే ..

ఇక ఇది మా చిన్న కుటుంబం (నానమ్మ, తాతయ్య , నాన్న , అమ్మ, మరియు నేను )

ఈ సారి , నా డాన్స్ ప్రోగ్రాం కి మీ అందరిని కూడా పిలుస్తాను లే...

ఇక వుంటాను ఫ్రెండ్స్ మరి...

ఇట్లు జోషిత.

Monday, September 13, 2010

నాకు అప్పుడే రెండు సంవత్సరాలు నిండినవి


హలో ఫ్రెండ్స్,

ఎలా వున్నారు ??

నా రెండవ పుట్టినరోజు సందర్బంగా , నానమ్మ నన్ను హైదరాబాద్ నుండి బెంగుళూరు తీసుకొని వచ్చినది . నేను సెప్టెంబర్ 11 న బెంగుళూరు వచ్చినాను .

పాపం నన్ను చూడగానే , అమ్మ, నాన్నకి ఎంతో అచ్చర్యం ...ఏమిటి మన బుడ్డదానికి (అంటే నేనే లే ) అప్పుడే రెండు సంవత్సరాలు నిన్డినావా అని ?

బెంగళూరు రాగానే , అమ్మ , నాన్న నాకు మంచి పుట్టిన రోజు డ్రెస్ తెచ్చినారు . ఇదిగో చుడండి ..నా రెండవ పుట్టిన రోజు డ్రెస్ ..

బాగుంది కదా .....చాల బాగుంది. నాకు బాగా నచినది. ....నానమ్మ వాళ్ళు నాకు బెనారస్ పట్టు డ్రెస్ తీసుకున్నారు ..కాని, అమ్మ వాళ్ళు కొన్నదే వేసుకున్నాను లే.

ఆ రాత్రి , అమ్మ , నాన్న వాళ్ళు చాల కొనుక్కొని వచినారు .... బెల్లోన్స్ , ....మొదలుగున్నవి ...ఇవిగో చుడండి....ఇంటిని ఎలా తయారు చేసినారో ...

ఆదివారం వచినది కదా....అందుకే అమ్మ, నాన్న ..ఇద్దరే కస్తబడి ఇవన్ని కట్టినారు ...

మరచిపోయినాను చెప్పటం.......పుట్టిన రోజుకి ఎవరిని పిలవటం లేదు....( నాన్న వాళ్ళ తాతయ్యచనిపోఇనారు కదా )...నానమ్మ తో పాటు...పిచ్చమ్మ నానమ్మ ( అదే ...అమ్మ కి మేనత్త అవుతుంది లే.. ఇక నుండి బెంగుళూరు లో నన్ను చూసుకొనేది తనే ) వుంది మాతో..అంతే. ఇక ఎవరిని పిలవలేదు.

అమ్మ, నాన్న ఆఫీసు కి వెళ్తారు కదా..నన్ను చూసుకోవటానికి ...పిచ్చమ్మ నానమ్మ ని బెంగుళూరుతీసుకొని వచ్చినారు . చివరికి , నా రెండవ పుట్టినరోజుకి ఇంటిలో వున్నది ...అమ్మ, నాన్న , నానమ్మ, పిచ్చమ్మ నానమ్మ....అంతే.

పుట్టినరోజు సాయంత్రానికి , అంతా రెడీ చేసినారు .... కేకు తెచ్చినారు . స్వీట్స్ తెచ్చినారు ...

కేకు కట్ చేయక ముందే ...అమ్మ, నాన్న నన్ను ఫోటో స్టూడియో కి తీసుకొని వెళ్లి ఫోటో లు తీపించినారు ...అమ్మ , నాన్న కూడా చాల ఫోటో లు దిగినారు ...

పుట్టినరోజు డ్రెస్ లో నా పోటోలు ...బాగున్నాయ్ కదా...

తరువాత ఇంటికి వచ్చి కేకు కట్ చేసినాను....ఎవరిని పిలవ కుండా...మేమే కట్ చేసుకొని మేమే తిన్నాము ....బలే పుట్టినరోజు కదా...:) . ఇవిగో చుడండి...నా పుట్టినరోజు కేకు కట్ చేసిన ఫోటోలు .....

నాన్న నేను తినతాను. కొంచెం కేకు పెత్తు...

అమ్మ నీకు కేకు పెడతాను ..తిను కొంచెం...

అయ్యో నాన్న ...నీకు కొంచెం పెడతాను లే..ఎందుకు అల చూస్తావు...అమ్మ ఫస్ట్ కదా!.. :)

ఇదిగో తిను కొంచెం...

బాగున్నాయా ????

ఆ తరువాత ...కేకు , స్వీట్స్ తీసుకొని వెళ్లి....ఇంటి ఓనర్స్ , కి ఇచ్చి వచ్చినాను ..

అల రెండవ పుట్టినరోజు అయిపోయినది....

ఇక ఇప్పుడు , ఫామిలీ పోతోలు ....."అమ్మ , నాన్న , ఒక చిన్న జోషిత ..."

అమ్మ, నాన్న , నానమ్మ తో జోషిత.....

అమ్మ, నాన్న, నానమ్మ , పిచ్చమ్మ నానమ్మ (ఇక నుండి చుసుకోవలసింది ఈ నానమ్మ నే) తో

జోషిత ....

రెండవ పుట్టినరోజు కి మీ జోషిత ఎలా వుందో తెలుసా?

నడక , పరుగు నేర్చింది.....మాటలు , తిట్లు నేర్చినది ...

సొంతగా అన్నం తింటున్నాను ......గొడవ చేయటం మానేసినాను ...

నాన్న మీటింగ్ లో వుంటే...గొడవ చేయకుండా నాన్న పక్కనే కూర్చుంటాను ,

అమ్మ, నాన్న ఆఫీసు కి వెళ్తే...నానమ్మ దగ్గరే గొడవ చేయకుండా వుంటాను ...

ఇట్లు , మీ ఆశీసులు కోరుతూ ,

మీ జోషిత

Thursday, August 12, 2010

ఇది నాన్న కు బాదాకరం అయిన రోజులు

ముత్తతయ్య గారు చనిపొయినారు ..

నా ముత్తతయ్య అంటే ... నాన్న కి తాతయ్య అవుతారు లే... నాన్న ను చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచినారు .

నెల 10 (ఆగష్టు 10th 2010 ) చనిపొయినారు .. టైం లో , నేను , నాన్న , అమ్మ అందరం బెంగుళూరు లో నిద్రపోతున్నాము . రాత్రి 12 :30 కి నానమ్మ వాళ్ళు కాల్ చేసి నాన్నకి చెప్పినారు.

పాపం , నాన్న వెంటనే వెళ్ళిపొయినాడు . ..నేను చిన్న పిల్లని కదా... రాత్రి ప్రయాణం వద్దులే అని బెంగుళూరు లోనే వదిలేసి ...నాన్న ఒక్కడే వెళ్ళినాడు .

ఇదిగో చుడండి ...నా ముత్తతయ్య ఫోటో .....నన్ను ఉయ్యాలా లో పడుకో పెట్టినప్పుడు , వచ్చినారు ...

చనిపోయిన తరువాత , 15 రోజులకి ర్మ కార్యక్రమము కి , నాన్న , నేను చెరుకుంపాలెం వెల్లినాము. పాపం ఈసారి కూడా అమ్మ రాలేదు . అమ్మ కి ఆఫీసు లో పని వుండి, రాలేకపోయినది .

నేను నడక నేర్చిన తరువాత , ఇదే మొదటి సారి చెరుకుంపాలెం (నాన్న వాళ్ళ స్వగ్రామం ) వెళ్ళటం . ...అక్కడ , అన్న దానం చేసినారు . వుళ్ళో వాళ్ళు అందరు నన్ను బాగా ఆడించినారు.

నాన్న , తను చదువుకున్న స్కూల్ కి తీసుకొని వెళ్ళినాడు ....అక్కడ అందరికి నా చేత చాక్లెట్స్ ఇప్పించినాడు .

అక్కడ స్కూల్ లో , నా చేత చాక్లెట్స్ ఇప్పిస్తున్నప్పుడు నాన్న మొహం లో ఎంతో సంతోషం ...

పాపం తను ఒకటి నుండి అయిదు వరకు చదువుకున్న స్కూల్ లో , తన కూతురి తో ఇప్పుడు చాక్లెట్స్ ఇప్పిస్తున్నాడు కదా ...అందుకేనేమో అంత సంతోషం ..

ఇక, అక్కడి నుండి నన్ను సత్తెనపల్లి అమ్మమ వాళ్ళ వూరు పంపించినారు. ...అమ్మ, నాన్న లేకుండా అమ్మమ వాళ్ళ వూరు వెళ్ళటం అదే మొదట సారి . కాని తప్పలేదు . .

చేరుకుంపాలెం లో , నేను రాత్రి వుండటం కష్టం అని ....పంపినారు . నన్ను ఒక్క దాన్నే , అమ్మమ్మ వాళ్ళ వూరు పంపుతున్నపుడు నాన్న మొహం చూడాలి..ఏడ్పు ఒక్కటే తక్కువ..

ఎలా ఉంటానో అని బయం.....పాపం నాన్నకు నేను అంటే చాల చాల ఇష్టం లే....ఏడిస్తే చూడలేడు.

తరువాత రోజు వెంటనే , నానమ్మ , తాతయ్య అమ్మమ్మ వాళ్ళ వూరు వచ్చి , హైదరాబాద్ తీసుకొని వెళ్ళినారు .

అది సంగతులు మరి ...అల జరిగిపోయినది .

ఇట్లు,

మాటలు , పరుగులు నేర్చిన మీ జోషిత