మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Sunday, December 20, 2009

మాటలు-ఆటలు నేర్చిన లక్కీ

హాయ్ ఫ్రెండ్స్,




మీకు అందరికి తెలుసు కదా, నా తోలి పుట్ట్టిన రోజు తరువాత నేను నానమ్మ,తాతయ్య దగ్గర హైదరాబాద్ లో ఉంటున్నాను.
ప్రతి రెండు వారాలకు , అమ్మ , నాన్న బెంగుళూరు నుండి హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. ...పాపం , అమ్మ ,నాన్న కి నాతో ఆడుకోవాలని ఎంత కోరికో....

3 నెలల తరువాత, నేను 12th డిసెంబర్ న, బెంగుళూరు వచ్చినాను...మీకు తెలుసా....నేను బెంగళూరు వచ్చే సంగతి...బెంగళూరు ఇంటిలో నన్ను చూసే వరకు అమ్మ కి తెలియదు.
అల ఉదయాన్నే , నన్ను చూడగానే...అమ్మ చాల హ్యాపీ గ ఫీల్ అయినది . నానమ్మ, నాన్న ...అమ్మతో చెప్పకుండా...నన్ను బెంగళూరు తీసుకొని వచ్చినారు . :)


బెంగళూరు లో వున్నా 5 రోజులు ....అమ్మ , నాన్న తో చాల బాగా ఆడుకున్నాను... అప్పుడు అనిపించినది....అమ్మ, నాన్న నన్ను ఎంత మిస్ అవుతున్నానో అని ... :(

అమ్మ, నాన్న కూడా ...పాపం చాల ఫీల్ అయినారు...నాతొ బాగా ఆడుకున్నారు..

మీకు తెలుసా....నాకు చాల మాటలు , ఆటలు వచ్చినవి....
మాటలు : అమ్మ, బాబు, బాయ్ , తాత, అత్తా , దోబుచ్ ...మొదలు ..
ఆటలు : దోబుచ్, చెమ్మ చెక్క, దొంగాట...మొదలు
ఇదిగో దోబుచ్ ఆట .... :)) మీరు వస్తారా ఆడుకుందాము

హలో ఫ్రెండ్స్, నాకు ఆటలే కాదు ... కొన్ని పనులు చేయటం కూడా వచ్చు ..ఇదిగో చుడండి...ఎంత బాగా ఇల్లు వుడుస్తున్ననో ..


మీకు తెలుసా...నాకు కోపం వస్తే...కోరుకుతాను , గిచ్చుతాను..... కొడతాను.. :))
ఇదిగో.....నన్ను హైదరాబాద్ లో వుంచినందుకు.... నాన్న ని చిపిరితో కొడుతున్నాను :))

మల్లి నేను ఇక్కడా ( బెంగళూరు లో ) అలవాటు పడతాను అని.... నానమ్మ , 17th న హైదరాబాద్ తీసుకొని వెళ్ళినది .
పాపం, అమ్మ , నాన్న నన్ను హైదరాబాద్ పంపించటానికి చాల బాద పడినారు ...నాకు కూడా ఏడ్పు వచ్చినది ...
కాని ఏమి చేస్తారు...అమ్మ , నాన్న ఏమో ...ఆఫీసు కి వెళ్ళాలి...మల్లి , నేను ఇక్కడా అలవాటు పడితే హైదరాబాద్ లో వుండటం కష్టం అని...నానమ్మ నన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్ళినది. ఇదేమి జీవితాలో కదా .....:(( ( నాన్న ఇలా చెప్పి బాద పడుతుంటాడు లే )
ఇప్పుడు ఇప్పుడే కొంచెం ...హైదరాబాద్ లో అలవాటు పడుతున్నాను .

నా పొటోలు చూసి చాల రోజులు అయినది కదా...ఇదిగో చుడండి...


ఒకసారి మీరు అందరు...హైదరాబాద్ రండి...ఆడుకుండము....
ఇక వుంటాను మరి..
ఇట్లు,
కొంచెం బాదతో ,
మీ చిన్ని .....జోషిత ( లక్కి )

Wednesday, September 16, 2009

నా తోలి పుట్టిన రోజు విశేషాలు

పాపం అమ్మ, నాన్న నా పుట్టిన రోజు కోసం మూడు రోజులు తెగ కష్టపడినారు తెలుసా!!!
ఇదిగో...నా పుట్టిన రోజు అహవాన పత్రిక...చుడండి..

ఇక ,నా పుట్టిన రోజుకి నాన్న బ్యానర్లు కూడా చేపించినాడు ...ఇదిగో చుడండి ..


పుట్టిన రోజున ఉదయాన్నే లేగావగానే...అందరు వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్పినారు..
ఉదయాన్నే నానమ్మ పూజ చేసి , నాకు పాయసం పెట్టినది . అమ్మ, నాన్న నన్ను అస్వరదిన్చినారు .
అంతా రెడీ అయిన తరువాత, నేను, అమ్మ, నాన్న, వదిన (హరి) , చిన్న నానమ్మ , మామయ్యా కలసి , వృద్దాశ్రమం కి వెల్లినాము. వెళ్ళేటప్పుడు , కేకు , అరటికాయలు, బిస్కెట్స్ తీసుకొని వెల్లినాము.
ముందు రోజే తాతయ్య , నాన్న వెళ్లి వంద మందికి అన్న దానంకి రెడీ చేసి వచ్చినారు. మేము వెళ్ళేసరికి అంతా రెడీ గా వుంచినారు.
అక్కడ చాల మంది అవ్వలు వున్నారు . అక్కడ కేకు కట్ చేసినాను. అందరికి బిస్కెట్స్ మరియు కేకు ఇచ్చినాను. అవ్వలు అందరు నన్ను అస్వరిదిన్చినారు . ఆ తరువాత వాళ్ళు బోజనానికి వెళ్ళినారు. మేము ఇంటికి వచ్చినాము . ఇవిగో వృద్దాశ్రమం లో పొటోలు చుడండి .




ఇదిగో ఇదే మేము వెళ్ళిన వృద్దాశ్రమం ...

ఇక ఇంటికి వచ్చిన తరువాత, అమ్మ ,నాన్న డెకరేషన్ లో బిజీ అయిపోఇనారు. తాతయ్య ఏమో భోజనం చేపించటం లో బిజీ అయిపోఇనాడు . అమ్మమ్మ , అత్తయా ఏమో నన్ను రెడీ చేయటం లో బిజీ అయిపోఇనారు .ఇదిగో చుడండి...ఇంటి ముందు స్వాగతం బ్యానర్ ...

ఇంటి ఫై డెకరేషన్ , లైటింగ్ చుడండి ....


ఇదిగో నా బర్త్ డే కేకు ...

నా డ్రెస్ బాగుందా...!!!

రాత్రి 8 కి కేకు కట్ చేసినాను.....అప్పటికే అందరు బందువులు , మిత్రులు వచ్చినారు.

అందరికి చాక్లెట్స్ ఇచినాను.....మీకు తెలుసా, నేను అసలు ఏడవలేదు ....మంచి పిల్లను కదా !!!వచ్చిన పిల్లలు అందరికి గిఫ్ట్ లు , టోపీ లు ఇచ్చినాను...

ఆ తరువాత , అందరు డిన్నర్ కి వెళ్ళినారు ....డిన్నర్ లో, స్వీట్స్, పూరి లు , మశురుం, చికెన్, మటన్, ఐస్ క్రీం ...మొదలుగున్నవి పెట్టినారు.
మీకు తెలుసా...నాకు చాల మంది ఫ్రెండ్స్ వున్నారు.....250 మెంబెర్స్ వచినారు...నన్ను అస్వరిదిన్చతానికి ....
రాత్రి 11 వరకు పార్టీ జరిగినది ......
ఇక పార్టీ తరువాత , ఇంటిలోకి వచ్చి ...నాకు వచ్చిన బహుమతులు చూసుకొని మురిసి పాయినాను....
వాటితో ఆడుకుంటూనే ...నిద్రపోఇనాను...
ఇక వుంటాను ఫ్రెండ్స్...మల్లి కలుద్దాము .

Friday, August 21, 2009

నేను నాలుగు అడుగులు వేసినాను - మేము మైసూర్ వెల్లినాము

ఏమిటి ?? నడుచుకుంటూ మైసూర్ వెల్లినాము అనుకున్నారా ?? హ హ హ ..... అసలు సంగతి ఇది ...

హలో ఫ్రెండ్స్,

నేను ఈ నెల 12th న ( అంటే నాకు పదకొండు నెలలు పూర్తీ అయిన రోజున ) నాలుగు అడుగులు నడిచినానోచ్ ..
అమ్మ, నాన్న చాల ఆనందపదినారు .

పోఇన గురువారం (13th, ఆగుస్ట్ ) , నా పుట్టిన రోజు వస్తుంది కదా ... నన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్ళిపోవటానికి నానమ్మ బెంగుళూరు వచినది....నేను కొంచెం నానమ్మ కి అలవాటు పడాలి కదా..అందుకే ముందు వచ్చినది .

ఈ ఆనంద సమయం లో, మేము అందరం ....ఆదివారం (16th ఆగష్టు ) మైసూర్ ట్రిప్ వెల్లినాము.

మీకు నా మైసూర్ ట్రిప్ సంగతులు చెప్పనా ....



నేను కడుపు లో వున్నప్పుడు , అమ్మ మైసూర్ ట్రిప్ వెళ్ళినది అట......అయితే నాకు ఇది రెండవ మైసూర్ ట్రిప్ అన్నమాట ... అవును కదా ఫ్రెండ్స్ ??కార్ తీసుకొని , బెంగుళూరు నుండి 6:30 కి బయలు దేరినాము .

ముందుగా "శ్రీ రంగ పఠనం " వెల్లినాము . అక్కడ టిప్పు సుల్తాన్ రాజు ఇల్లు ( అదే తన కోట ) చూసినాను . ఇదిగో మీరు కూడా చుడండి ....

ఆ తరువాత , అమ్మ నాకు కొంచెం అఆం పెట్టాలని చుసినాది ..కాని తిన లేదు లే ....:)అక్కడి నుండి టిప్పు సుల్తాన్ అమ్మ , నాన్న సమాది చూసినాము . అక్కడే టిప్పు సుల్తాన్ సమాది కూడా. ఇదిగో మీరు చుడండి ...

అక్కడి నుండి ఆ పక్కనే వున్నా త్రివేణి సంగమం ( మూడు నదులు కలిసే స్తలం - కావేరి , ఇంక రెండు నదులు లే ) వెల్లినాము . అక్కడ పడవ కూడా ఎక్కినాము . ఇదిగో చుడండి .



అప్పటికే 12 అయినది .అక్కడి నుండి , నీళ్ళ జైలు కి వెల్లినాము . రాజు గారు వున్నప్పడు , ఖైదిలని ఆ నీళ్ళ జైలు లో వుంచే వారు అట. ఇదిగో చుడండి...



అక్కడి నుండి మేము రాగవేద్ర టెంపుల్ కి వెల్లినాము ( ఆ నీళ్ళ జైలు పక్కనే లే ). ప్రసాదం తెచ్చుకున్నాము.దేవుడి దర్శనం తరువాత , ఇక మేము శ్రీ రంగం పఠనం నుండి మైసూర్ బయలు దేరినాము. దారిలో నేను ప్రసాదం బాగా తిన్నాను. అసలే అక్కలి ఫై వున్నాను కదా. :)

మొదటగా , మైసూర్ లో , చమోన్దేస్వరి గుడి కి వెల్లినాము . ఆ గుడి పెద్ద కొండపై వుంది . ప్రయాణం చాల బాగుంది . ఇదిగో పొటోలు చుడండి ...అక్కడినుండి వచేటప్పుడు , నంది గుడి కి వెల్లినాము... అక్కడ పెద్ద నంది వుంది . బాబోయ్ ఏట పెద్దదో చుడండి .

ఇక మైసూర్ ప్యాలస్ కి వచేసినాము .ఎప్పుడ ఎప్పుడా అని ఎదురు చూసినది దీనికోసమే లే :) ...నేను కాదు లే..మా నాన్న లే :) అదేదో మా నాన్న కట్టించినట్టు ఫీల్ అవుతాడు :)

ప్యాలస్ చాల చాల బాగుంది. - రాజు గారు పూజించిన దేవుడి విగ్రహాలు , బంగారపు, వెండి మందిరాలు , వస్తువులు , పెళ్లి మందిరం, వెండి తలుపులు , సింహాసాలు , ఇంకా కట్లు ,తుపాకులు , పిరంగులు ...మొదులు గున్నవి చూసినాము .పాపం నాను ఎత్తుకొని మోయలేక అమ్మ , నాన్న చాల కష్టపడినారు :)
ఇదిగో ప్యాలస్ దగ్గర పొటోలు చుడండి.... కుదిరితే మీరు కూడా ఒకసారి వెళ్ళండి..


అక్కడి నుండి అమ్మ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బృందావన్ గార్డెన్స్ కి బయలు దేరినాము...మేము వెళ్ళేటప్పటికి మబ్బులు లు కూడా వచినవి....టికెట్స్ కొని లోపలకి వెళ్ళే సరికి పెద్ద వర్షం పడినది.పాపం, అమ్మ బృందావన్ గార్డెన్ లో లైట్ షో చద్దాం అంటే కుదరలడు ....నా ఫై చినుకులు పడతాయి ఏమో అని...అంతే ఒక గంట సేపు నిలపదినారు ... వర్షం తగ్గిన తరువాత లైట్ షో చూడడం అని...ఇక వర్ష తగ్గక పోయే సరికి ...బృందావన్ గార్డెన్ చూడకుండానే.... 7 PM కార్ లో బెంగుళూరు బయలు దేరినాము...రాత్రి 11 pm కి బెంగుళూరు వచినాము...ఇక నిద్ర వస్తుంది ఫ్రెండ్స్...వుంటాను మరి...

Thursday, August 6, 2009

హలో ఫ్రెండ్స్ ఎలా వున్నారు ?

హలో ఫ్రెండ్స్ ,
ఇప్పుడు నాకు పదకొండవ నెల కదా .....ఇప్పుడు నేను నిలబడ గలుగుతున్నాను .. మరియు నాకు నాకు రెండు పళ్ళు కూడా వచినాయోచ్..
పోయిన నెల లో ( జూలై 19th - 28th ) , నానమ్మ కాసి వెళ్లి వచ్చినది . నాకు డ్రెస్ లు తెచ్చినది . కొత్త డ్రెస్ లో నా ఫోటో ఇదిగో చుడండి .....బాగుందా ??

బాగోలేదు అంటే కొట్టెస్తాను ......

రఫ్ ఆడిస్తాను ...

ఏమిటి బయపడి పొయినారా ? నిజం చెప్పనా... నేను చిన్న పిల్లని కదా...నాకే బయం ఎక్కువ..


నానమ్మ నాకు తేనే కూడా తెచినది...ఇప్పుడు నేను రోజు తేనే తింటున్నాను...మీకు తేనే పలుకులు చెప్పాలి కదా మరి.
ఈ మద్య నాకు ఏమి తినాలి అనిపించటం లేదు ఫ్రెండ్స్. అమ్మ , నాన్న ఏమో తెగ బాద పడిపోతున్నారు .
మీ అందరికి గుర్తు వుంది కదా...వచ్చే నెల లో (12th ) న నా పుట్టిన రోజు. తాత వాళ్ళ దగ్గర (హైదరాబాద్) కి వెళ్తాను . . హైదరాబాద్ లోనే పుట్టిన రోజు జరుపుకొని ....అక్కడే వుంటాను ఇంకా .
మీరు అందరూ తప్పకుండా రావాలి ...
ఇక వుంటాను ఫ్రెండ్స్ , నిద్రవస్తుంది...


ఇట్లు,
మీ జోషిత చౌదరి.

Thursday, July 30, 2009

నాన్న ఫై ఒక కవిత

రాజకీయాలు అంటూ ....నాన్న ( వెంకటేశ్వర రావు - MVRAO ) నా బ్లాగ్ వ్రాయటం లేదు కదా --

ఏ మయ్య వేంకటేశ యాడున్డావ్ తిరుమలేశా

బాబు బాబు అంటావు బెమ్బేల్లెతు తుంటావు
తెలుగు దేశం పార్టీ కాడ చక్కర్లేన్నో కోడతావు
పని చేసే కాడ నువ్వు పరేశానుగుంటావు
సెల్లు ఫోను మొగితెను సప్పుడు చెయ్య కుంటావు
ఏ మయ్య వేంకటేశ ఎట్టున్డావ్ తిరుమలేశా

బాల కృష్ణ అంటావు, హరి హరి అంటావు
యాన్ .టి .ఆర అంటేను ఏరేతిపోతావు
చంద్ర బాబు నాయుడంటే చల్లబడి పోతావు
ఏ మయ్య వేంకటేశ ఎడున్దావ్ తిరుమలేశా

ఎలేచ్షన్లంటావు ,అటు ఇటు తిరుగుతావు
మన కోసం తెలుగు దేశం మీటింగులు పెడతావు
మీటింగు కోసమని జనం కాడికి పోతావు
ఏ మయ్య వేంకటేశ ఏట్టున్డావ్ తిరుమలేశా

ఎలెక్షన్ రోజు నువ్వు బేజారుగా తిరుగుతావు
బెకారుగా టైమంతా వేస్టు చేస్తుంటావు
బాబు గాని వోడిపోతే బాధపడి పోతావు
ఏ మయ్య వేంకటేశ యాడున్డావ్ తిరుమలేశా

చక్కటి నీ వుద్యోగం నిర్లక్ష్యం చేస్తావు
సక్కనైనా సుక్కనీ సతాయిస్తూ వుంటావు
అందమైన చందమామతో ఆట లాడ నంటావు
ఏ మయ్య వేంకటేశ ఏట్టగయ్య తిరుమలేశా

- ఇక నా గురించి వ్రాస్తావా

Monday, June 15, 2009

గుంటూరు చిన్నది - కవిత


గుంటూరు చిన్నది గోరుముద్దలు తింటది
పప్పు ముద్ద పెడితే పళ్ళు కొరుకు తుంటది


గుంటూరు చిన్నది మురిసి పోతున్నది
ముసి ముసి నవ్వులతో మున్చెస్తూ వున్నది

గుంటూరు చిన్నది గుబాలిస్తూ వున్నది
ఎరుపు రంగు ఫ్రాకులోన అదిరి పోతున్నది


గుంటూరు చిన్నది నిదుర పోతున్నది
నిదుర లోన దోర్లేస్తూ పడి పోతు వున్నది

గుంటూరు చిన్నది పరేశానుగున్నది
అమ్మ నాన్న కోసం ఎదురు చూస్తున్నది

గుంటూరు చిన్నది నడక నేర్చు కున్నది
బుడి బుడి నడకలతో బోర్లా పడు తున్నది



కృష్ణుడి గుడి కి వెల్లినాము

ఈ వారం ( 14th జూన్ ), మేము బెంగళూరు లో ఇస్కాన్ ( కృష్ణుడి గుడి ) కి వెళ్లినాము .
అక్కడ చాల బాగుంది తెలుసా... వాటర్ పాల్స్ కూడా చాల బాగున్నాయ్.
దేవుడిని చూసే అంత వరకు, కృష్ణుడి మంత్రం ని నాన్న నా చెవిలో చెప్తూనే వున్నాడు.
మీకు తెలుసా ఆ మంత్రం : హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ....హరే రామ హరే రామ రామ రామ హరే హరే ...
నాన్న చెవిలో చెప్తుంటే చాల చాల బాగుంది .
ఆ తరువాత , వేకటేశ్వర స్వామి , నరసింహ స్వమి , కృష్ణుడి ని దర్శించుకొని....ప్రసాదం తీసుక్కొని వచినాము.
ఇంటికీ వచేసరికి , రాత్రి 9 అయినది. ఇక నాకు నిద్ర వస్తుంది లే ...
మీరు బెంగళూరు వచినప్పుడు, తప్పకుండ మల్లి ఇస్కాన్ కి వెళ్దాము.
ఇట్లు,
జోషి ( లక్కి )

Tuesday, June 9, 2009

నేను నిలబడుతున్ననోచ్

హలో ఫ్రెండ్స్ ,
నేను నా కాళ్ళ ఫై నిలబడ గలుగుతున్నాను. ఇదిగో చుడండి...

పాపం, అమ్మ , నాన్న బయపదిపోతున్నారు . నేను పది పోతానేమో అని. కొంచెం కొంచెం దెబ్బలు కూడా తగులుతున్నాయ్ లే .

పాయిన వారం ( 5th జూన్ ) , అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ - బార్గవి , లావణ్య వచినారు. నాకు ఒక పెద్ద బొమ్మ తెచినారు .ఇదిగో చుడండి ...

నా కన్నా పెద్దగ వుంది కదా. ....

అమ్మ ఫ్రెండ్స్ , నాకు మంచి ఫ్రెండ్స్ అయినారు . ఆం తినిపించినారు , స్నానం చేపించినారు. ....నేను బాగా ఆడుకున్నాను ...

మీకు ఇంకొక విషయం తెలుసా...??? నేను ఇప్పుడు తాతయ్య , అత్తా అని బాగా మాట్లాడుతున్నాను.నాన్న ఏమో .... నాన్న అను నాన్న అను అని అడుగుతున్నాడు...నాకు ఏమో రావటం లాదు .

నాకు మమ్మీ చాల డ్రెస్ లు తెచినది ... చుడండి ఈ కొత్త డ్రస్సు :

బాగుంది కదా ?

మీరు అందరు మా ఇంటికి ఇప్పుడు వస్తారు ?? నా పుట్టినరోజు గుర్తు వుంది కదా ??
ఇట్లు :
మీ జోషిత ( లక్కీ)