మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Wednesday, December 31, 2014

Japan Trip on 2012 year End

21st - Reached japan
22nd - sea paradise
23rd - hakone (open air musium )
24th - Kamaura (budda , temple) , yanoshima (beach , light house)
25th - rest
26th - Nikko (Tobu world square)
27th - Tama zoo
28th - Odiba
29th,30th - Snow board (Nozawa )
31st - Okachimachi (Shopping) , Yakohoma sakuragichho(new year)
1st - Akhebera (shopping) , kawasaki(shopping)
2nd - return

Sunday, July 22, 2012

సిస్కో ఫ్యామిలీ డే పార్టీ లో మీ జోషిత

నాన్న సిస్కో లో పని చేస్తున్నాడు కదా.. తన టీం ఫ్యామిలీ డే పార్టీ (July 21st 2012 )  అయితే , రిసార్ట్స్ కి వెల్లినాము...ఇదిగో చుడండి ...ఎలా ఎంజాయ్ చేసినానో

ఇదిగో , చిక్క కుండా , దొరకకుండా , నేను చిందులు వేస్తుంటే 'పసుపు' సైతం పలుచన అయినట్లు అనిపిస్తుంది కదా..ఏమిటి కొంచెం ఎక్కువ చెప్పినానా ?? పరవాలేదు లే మీకే కదా చెప్పినది :)

                                                 (సిగ్గు పడుతూ మీ లక్కీ )

ఆగు అమ్మ , నేను ఎక్కుతాను కదా ...

                                     (  అయ్యో రామ ఇది ఏమిటి అంత ఎత్తు వుంది .)

ఇదిగో నేను కనుక ఒక చిందు వేస్తె , పక్క వాడు కుడా అదిరి పడాలిసిందే













జై హింద్ ....

ఏమిటి అమ్మ ఆడుకోనివ్వు ...:( లేకపోతె నేను యేక్కడే నిరాహారదీక్ష చేస్తాను ..










సరే లే ఈ రోజు కి నిరాహార దీక్ష విరమిస్తున్నాను ..అసలే ఆకలి వేస్తుంది ... 








Thursday, June 7, 2012

LKG చదువుతున్న మీ లక్కీ


నేను LKG VIBGYOR  స్కూల్  లో చేరినాను . ఇదిగో చుడండి VIBGYOR స్కూల్ డ్రెస్ లో మీ జోశితా ని ...
రెండు నెలలు సమ్మర్ సెలవులు అయిపోయినవి . ఇక ఈరోజు నుండి మల్లి స్కూల్ కి వెళ్ళాలి ...
                                     (  ఉదయాన్నే లెగవాలి , తినాలి ..రెడీ అవాలి )
బస్సు కోసం పడిగాపులు కాయాలి ...కస్టాలు ఆన్నినాకేనా అనిపిస్తుంది...ఇదిగో చుడండి బస్సు కోసం ఎలా ఎదురు చూడాలో ..
నాతో పాటు , మా అపార్ట్ మెంట్ నుండి నేహుల్, దేవ్ కూడా VIBGYOR లోనే చేరినారు ...దేవ్ ఏమో LKG , నేహుల్ ఏమో 1st గ్రేడ్ (నా సీనియర్ అని పోజు కొడుతుంటాడు లే ) . 


       దేవ్, నేహుల్ తో పొటోలు 



ఇదిగో చుడండి , LKG లో చేరిన సందర్బంగా నాన్న నాకు ఒక కంప్యూటర్ కొని ఇచ్చినాడు...ఇక ఆరోజు నా హోయలె హొయలు :)
 










ఓ చెప్పటం మరచిపోయినాను ...రోజు 6 :30 కి లెగవాలి. 7 : 45 కి పాలు తాగి రెడీ అయిపోవాలి ...8 కి బస్సు వస్తుంది...మల్లి మద్యానం 1 కి ఇంటికి వస్తాను .

నన్ను ఇంకా డే కేర్ లో చేర్పించలేదు .. సమ్మర్ కి అమ్మమ్మ , తాతయ్య వచ్చినారు కదా....అమ్మ, నాన్న ఆఫీస్ కి వెళ్తే , తాతయ్యనే తీసుకొని వచ్చి అన్నం పెడుతున్నాడు .

అయ్యో చెప్పటం మరచినాను .. స్కూల్ కి వెళ్ళిన 1st రోజునే టీచర్ చేత కొట్టిన్చుకున్నాను ...గట్టిగా బుగ్గ గిల్లినది :(
ఎందుకు అంటారా?ఏమి చేస్తాం ..మన కాలు నిలవదు అయ్యా...లైన్ లో వుండు ఆంటే, పక్క నుండి వెళ్లి బస్సు యెక్క పోయినాను ..ఆంటే టీచర్ గట్టిగా బుగ్గ గిల్లినది..

ఇక పోస్ట్లు రెగ్యులర్ గా రాయలేను ఏమో...చదువుకోవాలి కదా ... హోం వర్క్ కుడా చాల వుంటుంది ..ఇక వుంటాను మరి .


ఇట్లు,
 మీ లక్కీ (LKG ) 





Sunday, April 1, 2012

మీ జోషిత నర్సరీ పూర్తి చేసినదోచ్

ఏమిటి నేను నర్సరీ పూర్తి చేసినాను అంటే నమ్మటం లేదా..ఇదిగో చుడండి...


ఇప్పటికైనా నమ్ముతారా ??

నర్సరీ లో గోల్డ్ మెడల్ వచ్చినది ..బంగారం రేటు ఎక్కువ అని ఆ స్కూల్ వాళ్ళు ఇవ్వలేదు లే..

ఇదిగో చుడండి , నా నర్సరీ స్కూల్ మేట్స్ తో గ్రూప్ ఫోటో.


ఇక రేపటి నుండి నాకు సెలవులు . సెలవలకి హైదరాబాద్ లో వున్న నానమ్మ , తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను లే..తాతయ్య బెంగుళూరు వచ్చినాడు సెలవలకి తీసుకొని వెళ్ళటానికి .

మీకు చెప్పటం మరచిపోయినాను..నెక్స్ట్ LKG కి , VIBGYOR International స్కూల్ లో admission దొరికనది . సెలవలు అయిపోయిన తరువాత, VIBGYOR లో Jr . KG చేరతాను.

ఇక వుంటాను .ఈ సెలవలులో బాగా ఎంజాయ్ చేయాలి :)

Saturday, February 4, 2012

మామయ్య పెళ్లి లో లక్కి హల్ చల్

హలో ఫ్రెండ్స్,

మీకు తెలుసు కదా , నాకు వున్నది ఒకే మేనమామయ్య (అనిల్ కుమార్ M .S ) , అమెరికా లో ఉంటాడు లే..పెళ్లి చేసుకుందాం అని వచ్చినాడు లే . ఏమిటో అంతా తొందర , కొంచెం ఆగితే నేనే చేసుకొనే దానిని కదా ..

సరే లే , తోడూ పెళ్లి కూతురిగా అయిన కుర్చుదాం . పాపం మన మామయ్య కదా .
అయ్యో నాకు సిగ్గేస్తుంది :)

అయ్యో రామ, ఈ పిచ్చమ్మ ఏమిటి , నిజంగానే నాకు పెళ్లి చేస్తుందా ఏమిటి ??

మీకు తెలుసా , మామయ్య పెళ్లి లో పెత్తనం అంతా నాదే ..ఇదిగో చుడండి , పెళ్లి పనులలో మీ జుషిత హడావుడి ..

బాబోయ్ చేతులు నొప్పులు వేస్తున్నాయి :( ఇక లేగవయ్య మామయ్య .ఈ విదంగా మూడురోజులు రుద్ది రుద్ది , నవంబర్ 6 న, మామయ్య ని స్వాతి అత్త దగ్గరికి (విజయవాడ లో పెళ్లి లే ) తీసుకొని వెళ్ళినాను . ఇక పెళ్లి చేయాలి కదా మరి :)


ఇదిగో చూడండి ...పెళ్లి డ్రెస్ లో ఎలా మురిసిపోతున్నారో స్వాతి అత్త , అనిల్ మామ :)

మనలో మాట , అత్త బాగుంది కదా :)
అయ్యో , అత్త సిగ్గు పడుతుంది ఏమిటి :)

ఏమిటి అత్త వైపు మాట్లాడుతున్నాను ఏమిటా అనుకుంటున్నారా ?? తప్పదు మరి , ఇక నుండి అత్త పెత్తనమే కాదా మరి :)

ఇక పెళ్లి మండపం దగ్గర హడావుడి చుడండి మరి ...
పెళ్లి మడపం బాగుంది కదా .
ఇక మరి అత్త , మామలో పెళ్లి సందడి చూద్దామా
మామయ్య కాళ్ళు బాగా కడగవయ్య అత్త తమ్ముడా :)

రావయ్యా పెళ్లి కొడకా రావయ్యా ..అత్త ఎదురు చూస్తుంది నీకోసం .

అత్తయ్య మామయ్య కోసం ఎలా ఎదురు చూస్తుందో చుడండి :)

హమ్మయ్య , అత్త మామల పెళ్లి అయ్యిపోయినదోచ్ ..
.
ఇదిగిదిగో అమ్మ నాన్న వచ్చేసినారు ...చుడండి ...ఎంత స్టైల్ గా అస్వరిదిస్తున్నారో ..ఇంజనీర్స్ కదా మరి :)

పెళ్లి అయిపోయిన తరువాత , ఇలా చివరిలో ఒక ఫోటో దిగి అందరం విజయవాడ నుండి సత్తెనపల్లి వచ్చినాము .

మల్లి సత్తెనపల్లి లో పూజ పనులు చేయాలి కదా మరి . ఎన్ని పనులు వున్నాయో మరి ..పదండి పదండి మరి .
ఇక నుండి నేను అత్త పార్టీ (మనలో మాట, ఇప్పటినుండే అత్తని కాక పట్టాలి కదా :)

తాతయ్య వాళ్ళ వురి లో ( అదే సత్తెనపల్లి లో ) , అత్త -మామ చేత కేకు కట్ చేపించినారు

మామయ్య , అత్తకేన కేకు !! నాకు పెట్టావా ??
ఇక నేను ఎందుకు లే , నేను వెళ్ళిపోతున్నాను .

అందరు పెళ్లి పనుల లో వుంటే, ఇదిగో నేను ఏమి చేస్తున్నానో చుడండి :)

ఇదిగో , బుల్లి సాయిని ( బుల్లిది అంతే బుల్లిది కాదు లే..నా కంటే పెద్దదే ) ఇలా పెళ్లి కూతురిని చేసినాను...లుక్కి నా మజాకా :)

ఇట్లు,
మీ లక్కీ (నర్సరీ From KIDZEE School )


Sunday, September 18, 2011

మూడోవ పుట్టినరోజు సంబరాల లో మీ జోషిత

హలో ఫ్రెండ్స్ ,

మీతో మాట్లాడుతూనే వున్నాను ..అప్పుడే నాకు మూడు సంవత్సరాలు నిండి పోయినవి కదా.

ఈ పుట్టిన రోజు కి , నానమ్మ , తాతయ్య బెంగుళూరు వచ్చినారు. ఈస్సారి , జాని (బాబాయ్యి అవుతాడు కదా ) కూడా వున్నాడు ఇంటిలోనే ...జాని బాబాయ్యి చాల మంచి వాడు లే..బాగా ఆడిస్తాడు.బాగా కొనిపెడతాడు :)

నానమ్మ ఏమో నాకు మూడు డ్రెస్ లు తెచ్చినది. అయిన , అమ్మ, నాన్న ఏమో మల్లి షాప్ కి తీసుకొని వెళ్లి మూడు డ్రెస్ లు కొనిపెట్టినారు .

సెప్టెంబర్ 11th నే, అమ్మ నాకోసం రెండు కేకు లు , చొక్లేత్స్ తెచ్చి ఇంటిలో పెట్టినది. ఒక కేకు ఏమో KIDZEE స్కూల్ దగ్గర , ఇంకొక కేకు ఏమో డే కేర్ దగ్గర కోయటానికి.

పుట్టినరోజు (SEPTEMBER 12th ) న ఉదయాన్నే నాన్న లేపి నాకు 'హ్యాపీ బర్త్ డే లక్కీ' అని చెప్పినాడు. ఆ తరువాత అమ్మ, జాని చేపినారు. ఇక ఆ తరువాత, ఫోన్ కాల్స్ వస్తూనే వున్నాయి ..ఫస్ట్ కాల్, పెద్ద నానమ్మ (జాని బాబాయి అమ్మ లే ) , ఆ తరువాత బుచుకు మామ , అ తరువాత మానస పిన్ని...సత్తెనపల్లి నుండి...అల అల వస్తూనే వున్నాయి..

ఈలోపు , అమ్మ , నాన్న నన్ను రెడీ చేసి kidzee స్కూల్ కి తీసుకొని వెళ్ళినారు. ఇదిగో చుడండి ..పుట్టినరోజు ఉదయాన్నే వేసుకున్న డ్రెస్ ..
బాగుందా ???చిన్న గుండు బాస్ ని కదా..

అయ్యో రామ , ఆ స్కూల్ వాళ్ళు ఏమో కేకు కట్టింగ్ కి ఒప్పుకోలేదు .. స్కూల్ లో కేకు కట్ చేయకూడదు ఆటా...(ఏమి స్కూల్ నో ...పి వాళ్ళు లే ). ఏమి చేస్తాము, నా ఫ్రెండ్స్ అందరికి, చొక్లేత్స్ పంచినాను.

మధ్యనమే , నాన్న ఆఫీసు నుండి వచ్చేసి , జాని తో కలసి నన్ను డే కేర్ కి తీసుకొని వెళ్ళినాడు . డే కేర్ లో కేకు కట్ చేసి , అందరికి కేకు పెట్టినాను . చొక్లేత్స్ ఇచ్చినాను . ఇదిగో చుడండి , ఇంత బాగా చేసినారో డే కేర్ లో... (నాన్న బాగా హ్యాపీగా ఫీల్ అయినాడు లే...)
ఇక ఆ తరువాత , ఇంటిని బెల్లోన్స్ తో అలకరించటం మొదలు పెట్టినాడు . అమ్మ డా , ఆఫీసు నుండి త్వరగా వచ్చేసినది . ఇదిగో చుడండి, ఏలా అలకరించినారో.

సాయంత్రం 8 కి బిల్డింగ్ లో ని అందరు మరియు అమ్మ ,నాన్న ఫ్రెండ్స్ వచ్చేసినారు . ఇక నేను ఫుల్ కుషి అయిపొయినాను..అందరితో బాగా ఆడుకున్నాను..ఇదిగో చుడండి..పుట్టినరోజు సాయంత్రం నా కొత్త డ్రెస్ లో పోతోలు .
వెలిగి పోతున్నాను కదా...నేను అంటే మరి :)

(నాకు కొంచెం కేకు)
( నాన్నకు కొంచెం కేకు)
అమ్మ నీకు కూడా పెట్టాలా ...వద్దులే నేనే తింటాను :)

ఆ తరువాత కేకు కట్ చేసి , అందరికి దండం పెట్టి అసిర్వాదం తీసుకున్నాను. ఇదిగో చుడండి , ఏలా బుద్ధిగా వున్నానో :)

లక్కీ గుడ్ గర్ల్ కదా మరి :)

మొత్తం ఈ పుట్టిన రోజుకి మూడు కేకు లు కట్ చేసినాను :). (నాలుగోవ పుట్టినరోజు కి నాలుగు సార్లు కట్ చేపిస్తాడు ఏమో కదా ).

నాకు చాల బొమ్మలు కూడా వచ్చినవి . అందరికి బోజనాలు పెట్టి పంపే సరికి రాత్రి 11 అయినది. అమ్మ , నాన్న బాగా కుషి అయిపొయినారు .

మల్లి డ్రెస్ మార్చినాను చుడండి :)

ఆ తరువాత రోజు కూడా, మల్లి అమ్మ తన ఆఫీసు ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చి పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసినది ఇంటిలో . రెండోవ రోజు కూడా..బోజానాలు పెట్టినది ...ఏమిటో , నా పుట్టినరోజు ని రెండు రోజులు జరిపినారు :) (software engineers బంగారు కూతురిని కదా ).

అమ్మ వాళ్ళ ఆఫీసు లో కూడా నా పుట్టిన రోజు సందర్బంగా కేకు కట్ చేసి , సెలెబ్రేట్ చేసినారు ...ఇదిగో చుడండి ఏలా చేసినారో .

అల రెండు రోజులు జరిపినారు నా పుట్టినరోజుని ...ఈసారి , అమ్మ , నాన్న ఫ్రెండ్స్ మద్య చాల బాగా జరిగినది కదా..

పుట్టినరోజు సందర్బంగా, నాన్న తన పేస్ బుక్ లో ఏమి పెట్టినాడో చుడండి...ఎంతమంది నాకు అసిర్వాదం యిచ్చినారో కదా ...

మొత్తం ఈ పుట్టిన రోజుకి మూడు కేకు లు కట్ చేసినాను :)
అప్పుడే నాకు నాలుగోవ సంవత్సరం లోకి వచ్చేసినాను :)

సరే మరి ఇక వుంటాను...మీరు కూడా , మీ ఆసిర్వాదం పంపండి .

ఇట్లు ,
మీ చిన్నారి , చిట్టి జోషిత చౌదరి .