మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Friday, November 19, 2010

వదినమ్మ వోణీల మహోత్సవం లో మీ జోషిత

హలో ఫ్రెండ్స్ ,

మీకు తెలుసు కదా ? వదినమ్మ అంటే హరి చందన , అదే నా అత్తమ్మ కూతురు .

ఎందుకు లే...ఇదిగో చుడండి వదినమ్మ ఫోటో ఒకసారి..

అత్తమ్మ ఎదురు చూస్తున్న రోజు (నవంబర్ 19th 2010) రానే వచ్చినది ....

వదిన కోసం...నాన్న చేపించిన ఆహావానం లు చుడండి ....నాన్న మజాక .

ఈరోజు నేను స్టేజి ఫై వేసి అడుగులు..పరుగులని అందరికి చూపాలి అని...తాతయ్య ,నానమ్మ కూడా ఎదురుచూస్తున్నారు లే..

ఇదిగో నా కొత్త డ్రెస్ ....అదిరేటి డ్రెస్ నేను వేస్తె ఎలా వుంటానో చుడండి మరి ...

బాగుందా?? మీకు ఇంకొక విషయం చెప్పనా??...ఈ డ్రెస్ ఫై పూసలు...డిజైన్ కుట్టినది నాన్నే...పాపం రెండు రోజులు కస్టపడి కుట్టినాడు...మరి నాన్నకి నేను అంటే అంత ఇష్టం కదా మరి...

ఇదిగో మా అమ్మ నాకు చేసిన అలంకరణ....నాకు అరవంకేలు అవసరమా?? ఇదిగో రబ్బరు బ్యాండ్ వేసి అల్లా పెట్టినది .

సూపరో సూపర్ కదా.... అమ్మ న మజాక నా ..

ఇక వోణీల మహోత్సవం కి వస్తే...చెప్పలిసినది..నా వదినమ్మ అలకరణ చుడండి....

నన్ను చూడు ....నేను వేసుకున్న బంగారం చూడు అన్నట్లు ఎంత మురిసి పోతుందో...

అబ్బో వదినమ్మో ...మరి అంతా వయారాలు పోకమ్మో...

మన లో మాట...వదినమ్మ బాగుంది కదా ఈ డ్రెస్ , అలంకరణ లో ...

అదేలే నా అంతా కాదు అనుకోండి ... :)

ఇక , పార్టీ లో ఇంకొకటి చెప్పుకోవాలి...డాన్స్ , పాటల ప్రోగ్రాంపెట్టిన్చినారు కదా.....ఇదిగో చుడండి..

నేను ముందే చెప్పినాను..నేను వుండగా బయట వాళ్ళు ఎందుకు అని...ఈ పెద్ద వాళ్ళు , మా పిల్లల మాట వినరుకదా..

చివరికి ఎవరు బాగా డాన్స్ వేసినారో మీరే చెప్పండి....

అందరు నన్నే మేచుకున్నారు....నేను కనుక ఒక తిప్పుడు తిప్పినాను అంటే..అంతే...అల పడిపోవలిసినదే...

కొంచెం ఎక్కువ చెప్తున్నాను కదా .. :)

వదినమ్మ మహోత్సవం లో జరిగిన కొన్ని మడురమిన గట్టలు చెప్పు కోవాలికదా...

ప్రోగ్రాం అంతా నాన్నే నన్ను ఎత్తుకొని...వచ్చిన వాళ్ళ అందరికి చూపించి ....మురిసిపోయినాడు ..

అమ్మ ఏమో...సింగారించుకొని...అటు ఎటు తిరుగుతూ హడావుడి చేస్తూ వున్నది..ఇదిగో చుడండి మరి..

వదినమ్మ ,అమ్మ ,నాన్న దగ్గర అసిర్వాదం తీసుకుంటుంటే ...నేను ఏమి తక్కువ తిన్నానా ?? ఇదిగో నేను కూడా ఎలా ఆశీర్వాదం తీసుకున్నాను ...

ఇక ప్రోగ్రాం లో ... బాల కృష్ణ వేషం లో ఎవరో నటిస్తుంటే...నాన్న ని చూడాలి మరి...అబ్బో ..కాళ్ళ ఫై నిలబడ లేకపోఇనాడు లే...ఇదిగో చుడండి...ఆ స్టైలే...ఏదో ఈయనే బాల కృష్ణ అయిన లెవెల్ లో ఎచ్చులు పోతున్నాడు..:)

ఇక చివరి లో నేను వేసిన డాన్స్...తిప్పుడు, ఈ ప్రోగ్రాం మొత్తం లో..మరచి పోలేనిది లే ..

ఇక ఇది మా చిన్న కుటుంబం (నానమ్మ, తాతయ్య , నాన్న , అమ్మ, మరియు నేను )

ఈ సారి , నా డాన్స్ ప్రోగ్రాం కి మీ అందరిని కూడా పిలుస్తాను లే...

ఇక వుంటాను ఫ్రెండ్స్ మరి...

ఇట్లు జోషిత.