మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Sunday, December 20, 2009

మాటలు-ఆటలు నేర్చిన లక్కీ

హాయ్ ఫ్రెండ్స్,




మీకు అందరికి తెలుసు కదా, నా తోలి పుట్ట్టిన రోజు తరువాత నేను నానమ్మ,తాతయ్య దగ్గర హైదరాబాద్ లో ఉంటున్నాను.
ప్రతి రెండు వారాలకు , అమ్మ , నాన్న బెంగుళూరు నుండి హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. ...పాపం , అమ్మ ,నాన్న కి నాతో ఆడుకోవాలని ఎంత కోరికో....

3 నెలల తరువాత, నేను 12th డిసెంబర్ న, బెంగుళూరు వచ్చినాను...మీకు తెలుసా....నేను బెంగళూరు వచ్చే సంగతి...బెంగళూరు ఇంటిలో నన్ను చూసే వరకు అమ్మ కి తెలియదు.
అల ఉదయాన్నే , నన్ను చూడగానే...అమ్మ చాల హ్యాపీ గ ఫీల్ అయినది . నానమ్మ, నాన్న ...అమ్మతో చెప్పకుండా...నన్ను బెంగళూరు తీసుకొని వచ్చినారు . :)


బెంగళూరు లో వున్నా 5 రోజులు ....అమ్మ , నాన్న తో చాల బాగా ఆడుకున్నాను... అప్పుడు అనిపించినది....అమ్మ, నాన్న నన్ను ఎంత మిస్ అవుతున్నానో అని ... :(

అమ్మ, నాన్న కూడా ...పాపం చాల ఫీల్ అయినారు...నాతొ బాగా ఆడుకున్నారు..

మీకు తెలుసా....నాకు చాల మాటలు , ఆటలు వచ్చినవి....
మాటలు : అమ్మ, బాబు, బాయ్ , తాత, అత్తా , దోబుచ్ ...మొదలు ..
ఆటలు : దోబుచ్, చెమ్మ చెక్క, దొంగాట...మొదలు
ఇదిగో దోబుచ్ ఆట .... :)) మీరు వస్తారా ఆడుకుందాము

హలో ఫ్రెండ్స్, నాకు ఆటలే కాదు ... కొన్ని పనులు చేయటం కూడా వచ్చు ..ఇదిగో చుడండి...ఎంత బాగా ఇల్లు వుడుస్తున్ననో ..


మీకు తెలుసా...నాకు కోపం వస్తే...కోరుకుతాను , గిచ్చుతాను..... కొడతాను.. :))
ఇదిగో.....నన్ను హైదరాబాద్ లో వుంచినందుకు.... నాన్న ని చిపిరితో కొడుతున్నాను :))

మల్లి నేను ఇక్కడా ( బెంగళూరు లో ) అలవాటు పడతాను అని.... నానమ్మ , 17th న హైదరాబాద్ తీసుకొని వెళ్ళినది .
పాపం, అమ్మ , నాన్న నన్ను హైదరాబాద్ పంపించటానికి చాల బాద పడినారు ...నాకు కూడా ఏడ్పు వచ్చినది ...
కాని ఏమి చేస్తారు...అమ్మ , నాన్న ఏమో ...ఆఫీసు కి వెళ్ళాలి...మల్లి , నేను ఇక్కడా అలవాటు పడితే హైదరాబాద్ లో వుండటం కష్టం అని...నానమ్మ నన్ను హైదరాబాద్ తీసుకొని వెళ్ళినది. ఇదేమి జీవితాలో కదా .....:(( ( నాన్న ఇలా చెప్పి బాద పడుతుంటాడు లే )
ఇప్పుడు ఇప్పుడే కొంచెం ...హైదరాబాద్ లో అలవాటు పడుతున్నాను .

నా పొటోలు చూసి చాల రోజులు అయినది కదా...ఇదిగో చుడండి...


ఒకసారి మీరు అందరు...హైదరాబాద్ రండి...ఆడుకుండము....
ఇక వుంటాను మరి..
ఇట్లు,
కొంచెం బాదతో ,
మీ చిన్ని .....జోషిత ( లక్కి )