మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Sunday, January 17, 2010

2010 సంక్రాంతి సంబరాల్లో మన్నెం వారి చిన్నది

హాయ్ ఫ్రెండ్స్ ,
మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు .

బోగి రోజు , నానమ్మ నాకు బోగిపండ్లతో స్నానం చేపించినది. ఇదిగో చుడండి...నా కొత్త డ్రెస్...

అయ్యో నాకు సిగ్గు వేస్తుంది .....

సంక్రాంతి కి అమ్మ, నాన్న హైదరాబాద్ వచ్చినారు . ..
మేము అందరం కలసి ‘అదుర్స్’(జూనియర్ న్.టి.ర్) మూవీ కి , ప్రసాద్ దియేటర్ కి వెళ్ళినాము.
ప్రసాద్ ధియేటర్ లో చాల బాగా ఆడుకున్నాను. ఇదిగో చుడండి , అమ్మ , నాన్న ఎలా అడిన్చినారో..


ఓరే.....నాన్న కాసేపు ఆడుకోనివ్వు రా.......
ఆగవమ్మ నానమ్మ ....నడుస్తున్నాను కదా...నీకు అంతా తొందరే ...

సినిమాకి తెస్తే సరిపోదు ...వో అమ్మా....ఏమైన కొనిపెట్టవామ్మ ....

అక్కడ ధియేటర్ లో సౌండ్ కి తట్టుకోలేనేమో అని , అమ్మ –నాన్న చాల జాగ్రత్తలు తీసుకున్నారు.
కాటన్ నా చేవ్విలో పెట్టినారు....నేను ఏమో అవి అన్ని తీసి వేసి...ధియేటర్ లో కూడా బాగా ఆడుకున్నాను.
పాటలు వచినప్పుడు , నేను కూడా బాగా డాన్స్ వేసినాను ...
మీకు తెలుసా ఫ్రండ్స్ ?? .....నాకు డాన్స్ కొంచెం బాగా వచ్చినది ....
త్వరలోనే నా డాన్స్ వీడియొ పెడతాను ...చుడండి...
మీకు ఒక విషయం చెప్పనా...
ఈ మద్య డాక్టర్ ఒక ఇంజక్షన్ చేస్తే......చిన్న పిల్లలు ఏమి చేస్తారు ఏడుస్తారు కదా....నేను ఏమో డాక్టర్ ని కొట్టినాను .. కొంచెం రౌడీ పిల్లని అయినాను లే...నాన్న దగ్గరే నేర్చుకున్నాను :)
మరి వుంటాను మరి......
యిట్లు,
మీ జోషిత ,

Monday, January 4, 2010

నూతన సంవత్సర సంబరాలలో మీ జోషిత

హాయ్ ఫ్రెండ్స్ ,
మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు .

కొత్త సంవత్సరం నాతో కలసి జరుపుకొనుటకు అమ్మ ,నాన్న 24th న హైదరాబాద్ వచ్చినారు .
చాల కొత్త డ్రెస్సులు తెచ్చినారు . ఇదిగో చుడండి ..కొత్త ద్రేస్స్లేలలో మీ జోషిత :




25th న మేము అందరం , సిల్పరామం వెళ్ళినాము. ఇదిగో చుడండి , మీ జోషిత హల్-చల్

నాలుగు రోజులు హైదరాబాద్ లో వున్నా తరువాత, అమ్మ నన్ను సత్తెనపల్లి తీసుకొని వెళ్ళినది . మీకు తెలుసు కదా ...అక్కడ అమ్మమ్మ వాళ్ళు వుంటారు .నేను , అమ్మ మాత్రమె వెళ్ళినాము.
అక్కడ చిన్న పిల్లలతో బాగా ఆడుకున్నాను....అక్కడ కొత్త కదా...అమ్మని బాగా ఇబ్బంది పెట్టినాను లే...
డిసెంబర్ 31st రాత్రి కేకు కట్ చేసినాను ...ఇదిగో చుడండి....
ఈ అమ్మాయి ఏమిటి నాకల్లె చూస్తుంది....తొందర ఎందుకు , కేకు కోస్తాను కదా !!!


( పాపం నాన్న లేడు ఇక్కడ ..... )
వీడు ఎవడో.....ఐస్ క్రీం ఇంత లోపలి పెట్టినాడు...తీసుకోలేక పోతున్నాను ..


అక్కడ నాలాగే ఒక బుల్లి పాప ( సాయి ) వుంది ..ఇదిగో తన ఫోటో..నాకు అక్క అవుతుంది లే..
ఈ పిల్లకి తినటమే రాదు :)
తనతో బాగా ఆడుకున్నాను ..... తనకి ఏమి ఆటలు రావు...మీకు తెలుసు కదా మీ జోషిత చాల అల్లరి పిల్ల అని :)
నాలుగు రోజులు సత్తెనపల్లి లో వుండి , హైదరాబాద్ వచ్చినాను . నాన్న అసలే సెలవు పెట్టి వచ్చినాడు కదా ..నాతో ఆడుకోవటానికి ...

హైదరాబాద్ వాచేతప్పుడు ....ట్రైన్ లో చుడండి ఎలా ఎంజాయ్ చేసినానో ...


ఇస్తాను లేవయ్య బాబు..నీ కప్ లు నాకు ఏమి వద్దులే ...

చా ఈ జనం అంతా ఇంతే.... పడుకోవటం బెస్ట్ ....


హైదరాబాద్ వచ్చిన తరువాత ... కారు లో నాన్న తో కలసి హల్ – చల్ :



వొరేయ్ నాన్న నీకు కారు సరిగా వచ్చా .!!!.... సరిగా నడుపు ...
పని లో ...మీ జోషిత ...చాల పనులు వచ్చినవి లే..



జనవరి 4th న అమ్మ ,నాన్న బెంగుళూరు వెళ్ళిపోయినారు . నన్ను వదిలి వెళ్ళటానికి చాల బాదపడుతూ వెళ్ళినారు ..నేను కూడా అంతే చాల దిగులు వేసుకున్నాను ...ఏమి చేస్తాం పాపం...
ఇక్కడ నానమ్మ , తాతయ్య బాగానే చూసుకుంటున్నారు .... అందుకే కొంచెం సంతోషం. వుండగలుగుతున్నాను ..
వుంటాను మరి బాయ్ ....