మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Sunday, May 22, 2011

అమ్మమ్మ , తాతయ్య లతో మైసూరు ట్రిప్ సంగతులు

హలో ఫ్రెండ్స్ ,

ఈ ఎండాకాలం సెలవలకి తాతయ్య , అమ్మమ్మ బెంగళూరు వచ్చినారు . నేను పుట్టిన తరువాత తాతయ్య ( అమ్మ నాన్న ) బెంగుళూరు రావటం ఇదే మొదట సారి లే.

మే 21st (2011 ) , నేను , అమ్మ, నాన్న , అమ్మమ్మ , తాతయ్య అందరం ఉదయాన్నే 7 కి మా కార్ లో మైసూరు బయలుదేరినాము . 10 :30 శ్రీరంగపట్నం చేరుకొని, శ్రీ రంగానాధుని గుడికి వెల్లినాము.

గుడి నాకు బాగా నచ్చింది లే..బాగా ఎంజాయ్ చేసినాను...ప్రసాదం తిన్నాను..ఇదిగో చుడండి ....గుడిలో ప్రసాదం తింటున్నాను .

.


అక్కడ చాల బొమ్మల షాప్ లు వున్నాయి ..నాకు అది కావలి ,ఇది కావలి అంటే....పిసినారి నాన్న ఏమి కొనిపెట్టలేదు :(

ఆ తరువాత అందరం , టిప్పుసుల్తాన్ మ్యుసియం కి వెల్లినాము . నాకు

మాత్రం

ఆ మ్యుసియం బయట బాగా నచ్చినది . నేను ,నాన్న ఇద్దరం బయటే బాగా ఆడుకున్నాము. అమ్మ, తాతయ్య, అమ్మమ్మ లోపలి కి వెళ్లి చూసి వచ్చినారు .

ఆ తరువాత అందరం , టిప్పుసుల్తాన్ మ్యుసియం కి వెల్లినాము . ..


ఇదిగో చెట్లు ఎక్కినాను,

గంతులు వేసినాను . బలే వుంది లే అక్కడా . ఇదిగో చుడండి టిప్పుసుల్తాన్ మ్యుసియం దగ్గర నా పొటోలు .

ఒప్పుకుంటారా , చెట్టులు ఎక్కగలను...చితారి కొమ్మన చింతకాయలు కోయగలను :)

ఇదిగో టిప్పుసుల్తాన్ మ్యుసియం ముందు , అమ్మమ్మ ,తాతయ్య లతో పోతో .

మ్యుసియం నుండి త్రివేణి సంగమం దగ్గరికి వెల్లినాము (ఏదో మూడు నదులు ఇక్కడ కలుస్తాయి అట లే ). అక్కడ నదులు ఏమో కాని..కాకులు చాల వున్నాయి..వాటితో ఆడుకున్నాను..పక్కన వీడియొ వుంటుంది చుడండి ..ఎలా ఆడుకున్ననో ...:)

ఏమిటో , అమ్మ , తాతయ్య ఎంత సీరియస్ గా అలోచిట్టున్నారో చుడండి ...

ఇక శ్రీరంగపతనం నుండి మైసూరు వెల్లినాము. మైసూరు వెళ్ళే సరికి మద్యానం 2 అయినది . మైసూరు వెళ్ళగానే, ఒక చర్చి కి వెల్లినాము . అది 100 సంవత్సరాల క ముందు కట్టినారు అట..ఇదిగో పొటోలు చుడండి .


ఇక ఆకలి వేసినది .అందరం ఒక హోటల్ కి వెల్లినాము. బాబోయ్..ఎంతమంది వున్నారో..తినటానికే గంట పట్టినది.ఇక చివరికి ఐస్ క్రీం తిన్నాను (నాకు చాల ఇష్టం లే )

(అమ్మ నేను తింటాను కదా ..)

అక్కడి నుండి , మైసూరు జూ కి వెల్లినాము. ఇంటిదగ్గర బయలు దేరిన దగ్గర నుండి , ఈ నాన్న నాకు కొతి ని చూపిస్తా కోతి ని చూపిస్తా అని చెప్పినాడు ఈ జూ లో..ఏదో ఈయనే ఆ కోతుల్ని పెంచుతున్నట్లు :)

పాపం నాన్న 2 గంటలు ఎత్తుకొని , జూ అంట చూపించాడు ..జీబ్రా లు , కోతులు ,పులులు, సింహాలు , ఏనుగులు ...పాములు , పిచుకలు ..బాబోయ్ ఎన్ని చూసినాను. రోజు టివి లో చూడటమే కాని..ఇదే మొదట సారి ఇలా చూడటం ...చాల బాగా నచినది..బాగా ఎంజాయ్ చేసినాను.

ఇది చుడండి జూ లో పొటోలు ...పక్కన వీడియొ వుంటుంది అది కూడా చుడండి..


జూ నుండి , సాయంత్రం 5 :30 కి మైసూరు ప్యాలసు కి వెల్లినాము. అయ్యో పాపం, మేము వెళ్ళే టప్పటికే అది ముసేసినారు . పాపం నాన్న, అమ్మ బాద పడిద్ది అని..గేటు వాడికి పైసలు ఇచ్చి అందరిని లోపలి కి తీసుకొని వెళ్ళినాడు . ఏమి లాబం, ప్యాలసు లోపల చూడలేదు ...బయటే కాసేపు ఆడుకొని , పొటోలు దిగి వచ్చినాము . ఇవిగో చుడండి .

మైసూరు ప్యాలసు నుండి ...బృందావన్ గార్డెన్ కి వెల్లినాము..బాబోయి..అది ఇక్కడ ముసేస్తారో అని అమ్మ ఎంత కంగారు పడినదో... చివరికి అక్కడి కి వెళ్లేసరికి ట్రాఫ్ఫిక్ జాము . అంతే కార్ ని అక్కడే ఆపేసి..ఒక కిలోమీటర్ పరిగేట్టించినది అమ్మ...అమ్మ, తాతయ్య పరిగెత్తుతుంటే ....పాపం నాన్న ఏమో నన్ను ఎత్తుకొని పరిగెత్తినాడు బృందావన్ గార్డెన్ లోకి.

చివరికి బృందావన్ గార్డెన్ లోకి వెళ్లి..లైట్ షో చూసినాము..చాల బాగుంది.. పక్క వీడియొ లో చుడండి...బృందావన్ గార్డెన్ లైట్ షో బాగుంది.

ఇక రాత్రి 10 కి బృందావన్ గార్డెన్ నుండి బెంగుళూరు బయలు దేరినాము. రాత్రి 12 :30 కి బెంగుళూరు లో ఇంటికి వచ్చినాము.

అలా మైసూరు ట్రిప్ అయిపోయినది :)

ఉంటాను మరి..మల్లి కలుద్దాము ..