మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Thursday, August 12, 2010

ఇది నాన్న కు బాదాకరం అయిన రోజులు

ముత్తతయ్య గారు చనిపొయినారు ..

నా ముత్తతయ్య అంటే ... నాన్న కి తాతయ్య అవుతారు లే... నాన్న ను చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచినారు .

నెల 10 (ఆగష్టు 10th 2010 ) చనిపొయినారు .. టైం లో , నేను , నాన్న , అమ్మ అందరం బెంగుళూరు లో నిద్రపోతున్నాము . రాత్రి 12 :30 కి నానమ్మ వాళ్ళు కాల్ చేసి నాన్నకి చెప్పినారు.

పాపం , నాన్న వెంటనే వెళ్ళిపొయినాడు . ..నేను చిన్న పిల్లని కదా... రాత్రి ప్రయాణం వద్దులే అని బెంగుళూరు లోనే వదిలేసి ...నాన్న ఒక్కడే వెళ్ళినాడు .

ఇదిగో చుడండి ...నా ముత్తతయ్య ఫోటో .....నన్ను ఉయ్యాలా లో పడుకో పెట్టినప్పుడు , వచ్చినారు ...

చనిపోయిన తరువాత , 15 రోజులకి ర్మ కార్యక్రమము కి , నాన్న , నేను చెరుకుంపాలెం వెల్లినాము. పాపం ఈసారి కూడా అమ్మ రాలేదు . అమ్మ కి ఆఫీసు లో పని వుండి, రాలేకపోయినది .

నేను నడక నేర్చిన తరువాత , ఇదే మొదటి సారి చెరుకుంపాలెం (నాన్న వాళ్ళ స్వగ్రామం ) వెళ్ళటం . ...అక్కడ , అన్న దానం చేసినారు . వుళ్ళో వాళ్ళు అందరు నన్ను బాగా ఆడించినారు.

నాన్న , తను చదువుకున్న స్కూల్ కి తీసుకొని వెళ్ళినాడు ....అక్కడ అందరికి నా చేత చాక్లెట్స్ ఇప్పించినాడు .

అక్కడ స్కూల్ లో , నా చేత చాక్లెట్స్ ఇప్పిస్తున్నప్పుడు నాన్న మొహం లో ఎంతో సంతోషం ...

పాపం తను ఒకటి నుండి అయిదు వరకు చదువుకున్న స్కూల్ లో , తన కూతురి తో ఇప్పుడు చాక్లెట్స్ ఇప్పిస్తున్నాడు కదా ...అందుకేనేమో అంత సంతోషం ..

ఇక, అక్కడి నుండి నన్ను సత్తెనపల్లి అమ్మమ వాళ్ళ వూరు పంపించినారు. ...అమ్మ, నాన్న లేకుండా అమ్మమ వాళ్ళ వూరు వెళ్ళటం అదే మొదట సారి . కాని తప్పలేదు . .

చేరుకుంపాలెం లో , నేను రాత్రి వుండటం కష్టం అని ....పంపినారు . నన్ను ఒక్క దాన్నే , అమ్మమ్మ వాళ్ళ వూరు పంపుతున్నపుడు నాన్న మొహం చూడాలి..ఏడ్పు ఒక్కటే తక్కువ..

ఎలా ఉంటానో అని బయం.....పాపం నాన్నకు నేను అంటే చాల చాల ఇష్టం లే....ఏడిస్తే చూడలేడు.

తరువాత రోజు వెంటనే , నానమ్మ , తాతయ్య అమ్మమ్మ వాళ్ళ వూరు వచ్చి , హైదరాబాద్ తీసుకొని వెళ్ళినారు .

అది సంగతులు మరి ...అల జరిగిపోయినది .

ఇట్లు,

మాటలు , పరుగులు నేర్చిన మీ జోషిత