మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Friday, June 10, 2011

మీ జోషిత స్కూల్ కి తాయారు అయిన వేళ..

అయ్యో అప్పుడే నేను స్కూల్ కి వెళ్ళే టైం వచ్చినది ... జూన్ 6th ,2011 న అమ్మ , నాన్న , నన్ను KIDZEE స్కూల్ లో చేర్పించినారు .

ఇదిగో చుడండి నా స్కూల్ బాగ్, లంచ్ బాక్స్, వాటర్ బోటిల్ , ID కార్డు .

స్కూల్ డ్రెస్ లో నా ఫస్ట్ ఫొటోస్ ఇదిగో చుడండి...

(అబ్బో నాకు స్కూల్ టోపీ కుడా వుంది కదా ).

ఇదిగో ఆఫీసు కి వెళ్ళగానే..తన ఫీలింగ్స్ ఏదో పేస్ బుక్ లో పెడతాడు కదా..చుడండి..ఏమి వ్రాసినాడో -
" పెళ్లి అయిన తరువాత ...నా ప్రపంచం ( ఫ్రెండ్స్ తో సమావేశాలు , చుట్టూ పక్కన వున్నా వాళ్ళతో కులం పేరు పై సమావేశాలు , ఫ్రెండ్స్ తో సెల్ ఫోన్ కబుర్లు , గర్ల్ ఫ్రెండ్స్ తో అమీర్ పేట చుట్టూ, చెరువుల చుట్టూ తిరుగుళ్ళు , సమాజాన్ని ఉద్దరించటానికి కొన్ని ప్రోగ్రామ్స్, ఇంకా తోటి వయసు వాళ్ళతో రాజకీయ సమేవేశాలు ..అల చెప్పు కుంటూ పొతే...ఎన్నో ) అంత దూరం అయినది అనిపించినది . కాని ఈరోజు, నా కూతురిని (రెండు సవత్సరాల తొమ్మిది నెలలు ) మొదటసారిగా స్కూల్ డ్రెస్ లో స్కూల్ కి పంపుతుంటే...చెప్పలేని అనుభూతి ...ఇదేనేమో కుటుంబం అంటే ....మమకారం అంటే...ఏమి అంటారో కూడా మాటలు రావటం లేదు . ఇదేనేమో కొత్త ప్రపంచం ".

(అయ్యో రామ , ఈ స్కూల్ బ్యాగ్ ని నేను మోయలేకపోతున్నాను )

ఇక ఇంత స్కూల్ బ్యాగ్ లో నాన్న ఏమి పెడతాడో తెలుసా మీకు ??

ఒక బాక్స్ లో నేమో ,బిసికేతులు , చక్లేతులు . ఇంకొక బాక్స్ లోనేమో టిఫిను పెడతారు . ఇంక , ఒక వాటర్ బోతెల్ పెడతారు. మరిచిపోయాను...ఒక డ్రెస్ కూడా పెడతారు :)

ఏమిటి బుక్స్ ఏమి ఉండవా అని అనుకుంటున్నారా...నేను చిన్న పిల్లను కదా మరి..బుక్స్ ఏమి వుండవు :)

ఓ మరచిపోయినాను..నా స్కూల్ షెడ్యూల్ చెప్పలేదు కదూ ...ఉదయాన్నే 9 కి kidzee స్కూల్ కి వెళ్ళాలి (నాన్నే నే వదిలిపెడతాడు )...అక్కడినుండి 11 : 30 కి స్కూల్ నుండి 'డే కేర్' కి స్కూల్ వ్యాను లోనే వెళ్తాను. మల్లి సాయంత్రం 5 : 30 కి నాన్న డే కేర్ కి వచ్చి నాన్న నన్ను ఇంటికి తీసుకొని వెళ్తాడు .

చాల కష్టపడుతున్నాను కదా...అయ్యో పాపం , నా కన్నా అమ్మ , నాన్న ఇంకా చాల కష్టపడుతున్నారు నాకోసం..చుడండి..(వినండి ..వినండి అమ్మ , నాన్న కస్టాలు) :)

ఉదయాన్నే 6 : 30 కి నాన్న లేచి , మిల్క్ , గుడ్డు రెడీ చేస్తాడు . అమ్మని ,నన్ను 7 : 30 కి నిద్ర లేపుతాడు . లేచి దగ్గరిని నుండి చూడాలి నాన్న ఏమి ఏమి అంటాడో రోజు..

"లక్కీ లక్కీ బ్రష్ చెయ్ బ్రష్ చెయ్ అంటాడు " ..ఆ తరువాతా..

" లక్కీ లక్కీ గుడ్డు తిను తిను ...లక్కీ బుగ్గన పెట్టకు తిను తిను తిను తిను లక్కీ తిను తిను .." ఇదే పాటా.." ..ఆ తరువాత..

" లక్కీ పాలు తాగు...పాలు తాగు...తాగు ..తాగు...టైం అవుతుంది తాగు..." ..హే రాజి...రాజి ...నీళ్ళు రెడీ చెయ్ ...రాజి త్వరగా పెట్టు...స్కూల్ కి టైం అవుతుంది..రాజి ...రాజి ..రాజి.."

ఇలా రోజు ఉదయాన్నే 7 : 30 నుండి 9 వరకు పాడుతూనే ఉంటాడు పాపం. ఏమిటో, నేను ఏదో ఎప్పుడే డాక్టర్ చదివేస్తున్నట్లు.

ఇక డే కేర్ నుండి వచ్చిన తరువాత అయిన కూర్చుంటాడా అంటే....మల్లి పాట మొదల పెడతాడు ...సాయంత్రం 6 నుండి మల్లి స్టార్ట్ అంటాడు...

"లక్కీ పాలు తాగు..లక్కీ తాగు..కొంచెం..పాలు తాగు " ఆ తరువాత...

" లక్కీ ఆపిల్ తిను ..ఆపిల్ తిను...తిను ..తిను " ఇదే విదంగా...సాయంత్రం 7 : 30 వరకు తిను తిను..తాగు ..తాగు అంటూనే ఉంటాడు..

మల్లి సాయంత్రం అమ్మ ఆఫీసు నుండి వచెటప్పటికి స్నానం చెప్పించి రెడీ చేస్తాడు...అమ్మ సాయంత్రం 8 కి వస్తుంది కదా ...అప్పుడు మల్లి ఆఫీసు పని చేసుకుంటాడు...ఇక ఇప్పుడు వంతు..

"లక్కీ అన్నం తిను ..అన్నం తిను..తిను ...అన్నం తిను..బుక్కన పెట్టకు ...బుగ్గన పెట్టకు..." ఇదే పాట...రాత్రి 11 వరకు పాడుతూనే వుంటుంది .. పాపం ఇంత కస్తాపెడుతున్నానో కదా...

అంట అయిపోయిన తరువాత...రాత్రి 12 కి నిద్ర పోతాము...మల్లి ఉదయాన్నే 6 / 6 : 30 కి మొదలు అవుతంది :)

ఇలా నా స్కూల్ జీవితం సాగిపోతుంది మరి..మరి స్కూల్ చదువు లో బిజీ కదా..అందుకే మీకు అన్ని చెప్పలేకపోతున్నాను.

అయ్యో ఒకటి చెప్పటం మరచినాను...స్కూల్ కి వెళ్ళే ప్రతి రోజు అమ్మ , నాన్న నాకు ఒక ఫోటో తీస్తారు.. ఇదిగో చుడండి..కొన్ని స్టిల్స్ ..


సరే మరి ఇంక వుంటాను..మల్లి రేపు స్కూల్ కి వెళ్ళాలి కదా..