హైదరాబాద్ నుండి , నాన్నమ్మ, తాతయ్య , మామయ్యా తిరుపతి వచ్చినారు. సత్తెనపల్లి నుండి ఏమో , అమ్మమ్మ, తాతయ్య , మామయ్యలు ( మౌళి, హర్ష ), పిచ్చమ్మ అమ్మమ్మ వచ్చినారు.
ఇదిగో చుడండి...తిరుపతి లో దిగినప్పుడు నా ఫోటో లు ...


(ఎంత జుట్టు వుందో కదా ).
6th ఉదయాన్నే తిరుపతి వెళ్ళగానే , రెడీ చేసి గుండు చేపించటానికి తీసుకొని వెళ్ళినారు. నా గుండు బాస్ తాతయ్య వున్నాడు కదా ...ఇక లైను లేదు...వెయిటింగ్ లేదు..వెంటనే తీసుకొని వెళ్లి గుండు చెప్పించినాడు .
ఆ తరువాత, నేను, అమ్మ, నాన్న కలసి కల్యాణం చేపించటానికి వెల్లినాము .వెంకట్ స్వామీ ని చూసి వచ్చిన తరువాత , ఇక నా చెవులు కుట్టిస్తాము అంటే...అప్పుడు నాన్న పరిస్తితి చూడాలి...
అయ్యో వద్దు ...లక్కీ కి చెవ్వులు కుట్ట వద్దు ...బెంగుళూరు హాస్పిటల్ లో కుట్టిస్తాను అంటాడు....అయ్యో రామ...పిల్ల లకి చెవులు దేవుడి దగ్గర కుట్టిస్తారు అయితే...ఈ నాన్న ఏమో , బెంగుళూరు హాస్పిటల్ లో కుట్టిస్తాను అంటాడు.. (software ఇంజనీర్ కదా మరి ) :)
కాని, తాతయ్య లు , మామయ్యలు తీసుకొని వెళ్లి నాకు చెవ్వులు కుట్టించుకోని వచ్చినారు. నాన్న రాలేదు లే..నేను ఏడుస్తాను అని రాలేదు...
అమ్మమ్మ , తాతయ్య లు నాకు చేవ్వి పోగులు తెచ్చినారు కదా...చెవ్వులు కుట్టించుకోని , పోగులు పెట్టుకొని వస్తే...నాన్న నన్ను చూసి , తెగ మురిసిపోయినాడు :)

(నా చేవ్వి పోగులు బాగున్నాయా..)
ఇక ఆరోజు అంత తిరుపతి లోనే వుంది...తరువాత రోజు బెంగుళూరు వచేసినాము.
ఇదిగో చుడండి...మీ గుండు పాపాయి ఫోటోలు ...




చిన్న గుండు బాస్ లాగ వున్నాను కదా..
సరే మరి వుంటాను...స్కూల్ కి టైం అవుతుంది కదా..