చాల రోజులు ఐనది కదా మీకు ముచతలు చెప్పి...
ఇదిగో చుడండి నా కొత్త ఫోటోలు....చాల పెరిగినాను కదా..... కొంచెం తగ్గినట్లు వున్నాను కదా. (పెరుగుతున్నాను కదా మరి )



నాకు చాల ఆట పాటలు వచ్చినవి... నాతో ఆడుకోలేకపోతున్నందుకు పాపం నాన్న చాల బాద పడుతున్నాడు.......

ప్రతి రెండు వారాలకి ,నాతొ ఆడుకోవటానికి అమ్మా నాన్న హైదరాబాద్ వస్తున్నారు.....
పాపం హైదరాబాద్ వచ్చినప్పుడు నాన్న బయటకి కూడా వెళ్ళకుండా...నాతోనే ఆడుకుంటున్నాడు...
నన్ను కూడా బెంగలూరు తీసుకొని వెళ్ళాలి అని చాల అనుకుంటారు...కాని, వాళ్ళని వల్లే చూసుకోవటానికి టైం సరిపోదు కదా.....ఇక నన్ను ఏమి చూస్తారు....
ఇక్కడ నాన్నమ్మ బాగానే చుస్తుకుంటుంది ఫ్రెండ్స్.....బాగా అన్నం పెడుతుంది....రోజు అంతా ఆడిస్తుంది.....కాని అమ్మా , నాన్న దగ్గర లేరు కదా.....నాకు కూడా బాదగ వుంది..
అందుకే, అమ్మ వచ్చినప్పుడు , ఆ రెండు రోజులు ( శనివారం , ఆదివారం ) అసలు అమ్మని వదిలి వుండను....అమ్మతోనే వుంటాను...అమ్మ తోనే ఆడుకుంటాను....అమ్మ దగ్గరే తింటాను.

మల్లి ఆదివారం సాయంత్రం వెళ్ళేటప్పుడు , నన్ను పక్కకి పంపి...అమ్మ , నాన్న బాదతో ...ఏడుస్తూ ...బెంగలూరు వెళ్తారు...
ఆ తరువాత నాకు కొంచెం బాద అనిపిస్తుంది....నేను చెప్పలేను కదా...మాటలు రావు కదా....

నానమ్మ ని ఇబ్బంది పెట్టకూడదు కదా ...!! ...నానమ్మ, తాతయ్య , అత్తా , మామ దగ్గర ఆడుకున్తాను ...
ఇంత బాద పెట్టుకొని కూడా ఎలా నవ్వు తానో ...నవ్విస్తానో చుడండి ..


- మీ జోషిత ..
No comments:
Post a Comment