ఈ వినాయక చవితి కి కొట్టగా బెంగుళూరు లో ఇల్లు మారినాము (31st ఆగుస్ట్ న). ఈ కొత్త ఇల్లు చాల బాగుంది . ఇదిగో చుడండి..

(అమ్మ నాన్న కి ఏమో సోఫా , నాకు ఏమో గాలి కుర్చీ..నా గాలి కుర్చీ బాగుంది కదా .)
ఆ తరువాత రోజే (1st సెప్టెంబర్ ) వినాయక చవితి వచ్చినది కదా.. ఉదయాన్నే వెళ్లి , అమ్మ, నాన్న వినాయుకుడిని , పూజకు కావలిస్నివి తెచ్చినారు.
ఇక అందరం రెడీ అయిపొయ్యి..ఇదిగో చుడండి ..వినాయుకుడిని ఏలా ముస్తాము చేసినామో..



ఓయి..మరచిపోయినాను..నేను స్కూల్ కి వెళ్తున్నాను కదా..ఇదిగో నా పుస్తకాలకు కూడా పసుపు , కుంకం పెట్టి , వినాయుకుడి దగ్గర పెట్టినాను.

బాగా చదివి, డాక్టర్ అవాలి అని కోరుకున్నాను లే...:)
పూజ అయిపోయిన తరువాత , బాగా తిని...సాయంత్రం వినాయుకుడిని తీసుకొని వెళ్లి వేరే గుడి దగ్గర పెట్టి వచ్చినాము. :)
No comments:
Post a Comment