మా చిట్టి చిన్నారి జోషిత చౌదరి (అలియాస్ లక్కీ ) కి జన్మదిన శుభాకాంక్షలు

కూల్ వీడియోలు

Sunday, September 18, 2011

మూడోవ పుట్టినరోజు సంబరాల లో మీ జోషిత

హలో ఫ్రెండ్స్ ,

మీతో మాట్లాడుతూనే వున్నాను ..అప్పుడే నాకు మూడు సంవత్సరాలు నిండి పోయినవి కదా.

ఈ పుట్టిన రోజు కి , నానమ్మ , తాతయ్య బెంగుళూరు వచ్చినారు. ఈస్సారి , జాని (బాబాయ్యి అవుతాడు కదా ) కూడా వున్నాడు ఇంటిలోనే ...జాని బాబాయ్యి చాల మంచి వాడు లే..బాగా ఆడిస్తాడు.బాగా కొనిపెడతాడు :)

నానమ్మ ఏమో నాకు మూడు డ్రెస్ లు తెచ్చినది. అయిన , అమ్మ, నాన్న ఏమో మల్లి షాప్ కి తీసుకొని వెళ్లి మూడు డ్రెస్ లు కొనిపెట్టినారు .

సెప్టెంబర్ 11th నే, అమ్మ నాకోసం రెండు కేకు లు , చొక్లేత్స్ తెచ్చి ఇంటిలో పెట్టినది. ఒక కేకు ఏమో KIDZEE స్కూల్ దగ్గర , ఇంకొక కేకు ఏమో డే కేర్ దగ్గర కోయటానికి.

పుట్టినరోజు (SEPTEMBER 12th ) న ఉదయాన్నే నాన్న లేపి నాకు 'హ్యాపీ బర్త్ డే లక్కీ' అని చెప్పినాడు. ఆ తరువాత అమ్మ, జాని చేపినారు. ఇక ఆ తరువాత, ఫోన్ కాల్స్ వస్తూనే వున్నాయి ..ఫస్ట్ కాల్, పెద్ద నానమ్మ (జాని బాబాయి అమ్మ లే ) , ఆ తరువాత బుచుకు మామ , అ తరువాత మానస పిన్ని...సత్తెనపల్లి నుండి...అల అల వస్తూనే వున్నాయి..

ఈలోపు , అమ్మ , నాన్న నన్ను రెడీ చేసి kidzee స్కూల్ కి తీసుకొని వెళ్ళినారు. ఇదిగో చుడండి ..పుట్టినరోజు ఉదయాన్నే వేసుకున్న డ్రెస్ ..
బాగుందా ???చిన్న గుండు బాస్ ని కదా..

అయ్యో రామ , ఆ స్కూల్ వాళ్ళు ఏమో కేకు కట్టింగ్ కి ఒప్పుకోలేదు .. స్కూల్ లో కేకు కట్ చేయకూడదు ఆటా...(ఏమి స్కూల్ నో ...పి వాళ్ళు లే ). ఏమి చేస్తాము, నా ఫ్రెండ్స్ అందరికి, చొక్లేత్స్ పంచినాను.

మధ్యనమే , నాన్న ఆఫీసు నుండి వచ్చేసి , జాని తో కలసి నన్ను డే కేర్ కి తీసుకొని వెళ్ళినాడు . డే కేర్ లో కేకు కట్ చేసి , అందరికి కేకు పెట్టినాను . చొక్లేత్స్ ఇచ్చినాను . ఇదిగో చుడండి , ఇంత బాగా చేసినారో డే కేర్ లో... (నాన్న బాగా హ్యాపీగా ఫీల్ అయినాడు లే...)
ఇక ఆ తరువాత , ఇంటిని బెల్లోన్స్ తో అలకరించటం మొదలు పెట్టినాడు . అమ్మ డా , ఆఫీసు నుండి త్వరగా వచ్చేసినది . ఇదిగో చుడండి, ఏలా అలకరించినారో.

సాయంత్రం 8 కి బిల్డింగ్ లో ని అందరు మరియు అమ్మ ,నాన్న ఫ్రెండ్స్ వచ్చేసినారు . ఇక నేను ఫుల్ కుషి అయిపొయినాను..అందరితో బాగా ఆడుకున్నాను..ఇదిగో చుడండి..పుట్టినరోజు సాయంత్రం నా కొత్త డ్రెస్ లో పోతోలు .
వెలిగి పోతున్నాను కదా...నేను అంటే మరి :)

(నాకు కొంచెం కేకు)
( నాన్నకు కొంచెం కేకు)
అమ్మ నీకు కూడా పెట్టాలా ...వద్దులే నేనే తింటాను :)

ఆ తరువాత కేకు కట్ చేసి , అందరికి దండం పెట్టి అసిర్వాదం తీసుకున్నాను. ఇదిగో చుడండి , ఏలా బుద్ధిగా వున్నానో :)

లక్కీ గుడ్ గర్ల్ కదా మరి :)

మొత్తం ఈ పుట్టిన రోజుకి మూడు కేకు లు కట్ చేసినాను :). (నాలుగోవ పుట్టినరోజు కి నాలుగు సార్లు కట్ చేపిస్తాడు ఏమో కదా ).

నాకు చాల బొమ్మలు కూడా వచ్చినవి . అందరికి బోజనాలు పెట్టి పంపే సరికి రాత్రి 11 అయినది. అమ్మ , నాన్న బాగా కుషి అయిపొయినారు .

మల్లి డ్రెస్ మార్చినాను చుడండి :)

ఆ తరువాత రోజు కూడా, మల్లి అమ్మ తన ఆఫీసు ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చి పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసినది ఇంటిలో . రెండోవ రోజు కూడా..బోజానాలు పెట్టినది ...ఏమిటో , నా పుట్టినరోజు ని రెండు రోజులు జరిపినారు :) (software engineers బంగారు కూతురిని కదా ).

అమ్మ వాళ్ళ ఆఫీసు లో కూడా నా పుట్టిన రోజు సందర్బంగా కేకు కట్ చేసి , సెలెబ్రేట్ చేసినారు ...ఇదిగో చుడండి ఏలా చేసినారో .

అల రెండు రోజులు జరిపినారు నా పుట్టినరోజుని ...ఈసారి , అమ్మ , నాన్న ఫ్రెండ్స్ మద్య చాల బాగా జరిగినది కదా..

పుట్టినరోజు సందర్బంగా, నాన్న తన పేస్ బుక్ లో ఏమి పెట్టినాడో చుడండి...ఎంతమంది నాకు అసిర్వాదం యిచ్చినారో కదా ...

మొత్తం ఈ పుట్టిన రోజుకి మూడు కేకు లు కట్ చేసినాను :)
అప్పుడే నాకు నాలుగోవ సంవత్సరం లోకి వచ్చేసినాను :)

సరే మరి ఇక వుంటాను...మీరు కూడా , మీ ఆసిర్వాదం పంపండి .

ఇట్లు ,
మీ చిన్నారి , చిట్టి జోషిత చౌదరి .

No comments:

Post a Comment